Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshMassive Rain Cloud Looms Over India : భారత్‌పై1500 కిలోమీటర్ల 'మెగా' వర్షమేఘం, ఎండలకు...

    Massive Rain Cloud Looms Over India : భారత్‌పై1500 కిలోమీటర్ల ‘మెగా’ వర్షమేఘం, ఎండలకు ఇక ఎండ్ కార్డేనా

    📰 Generate e-Paper Clip

     

    Massive Rain Cloud Looms Over India: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉత్తర భారతదేశాన్ని కొన్ని వారాలుగాని ప్పు ల కొలిమిలా మార్చేసిన భానుడి భగభగల కు బ్రేక్ పడబో తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనా ల రాక ఆలస్యం కావడంతో అల్లాడిపోయిన ప్రజలకు ప్రకృ తి ఎట్టకేలకు ఒక భారీ ఊరటనిచ్చే గుడ్ న్యూస్ చెప్పిం ది. అంతరిక్షం నుంచి వచ్చిన తాజా శాటిలైట్ (ఉపగ్రహ) చిత్రా లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

    1500 కిలోమీటర్ల భారీ మేఘాల కోట

    సాధారణంగా వర్షాలు కురవడం వేరు, కానీ ఇప్పుడు ఏకం గా ఉత్తర బంగాళాఖాతం నుండి జమ్మూకశ్మీ ర్ వరకు ఒక భారీ రుతుపవన ద్రో ణి (Monsoon Trough) ఏర్ప డింది. స్పేస్ నుండి చూస్తే ఇది దా దాపు 1,500 కిలోమీటర్ల పొడ వైన ఒక భారీ వర్షమేఘాల కారిడార్‌లా కనిపిస్తోంది. భారత దేశంపై ఇంత భారీ స్థాయిలో మేఘాలు కమ్ముకోవడం వాతా వరణ చరిత్రలోనే ఒక అద్భుత దృశ్యం.

    వాతావరణంలో మారబోయే సీన్ ఇదే

    ఈ రుతుపవన ద్రోణి వేగంగా దక్షి ణం వైపు కదులుతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్లబడ నుంది. ఉరుము లతో కూడిన భారీ వర్షాలు ఉత్తర భారతదే శం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన గండ్రగొడ్డలి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరి స్తున్నారు. వడగాల్పులు, తీవ్రమై న ఉష్ణోగ్రతలతో సతమతమవు తున్న కోట్లాది మంది ప్రజలకు ఈ ‘మెగా మే ఘం’ అమృతధార కానుంది.

    రాబోయే కొన్ని రోజులు భారీ వ ర్షాలు పడే అవకాశం ఉన్నం దున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్త లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా, ఎండల తీవ్రతకు ఈ 1500 కిలోమీటర్ల వర్షమేఘం చెక్ పెట్ట బోతుండటం నిజంగానే బిగ్ రిలీఫ్ గా పరిగణించవచ్చు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.