Sunday, September 27, 2026
More
    HomeOpinionCm Revanth Reddy yadadri temple : బిగ్ బ్రేకింగ్, అధ్యాత్మికవైభవం వైపు యాదాద్రి, రూ.100...

    Cm Revanth Reddy yadadri temple : బిగ్ బ్రేకింగ్, అధ్యాత్మికవైభవం వైపు యాదాద్రి, రూ.100 కోట్లతో సీఎం రేవంత్ పలు శంకుస్థాపనలు

    📰 Generate e-Paper Clip

    Cm Revanth Reddy yadadri temple :  ప్రజా దీవెన, యాదగిరిగుట్ట యా దాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం త్వరలోనే సరికొత్త హం గులతో అంతర్జాతీయ స్థాయి ఆ ధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతోంది. భక్తుల సౌకర్యార్థం, వైదిక సం స్కృతి పరిరక్షణే ధ్యేయంగా రూ. 99.55 కోట్ల భా రీ వ్యయంతో చేప ట్టనున్న ఐదు ప్రతిష్టాత్మక అనుబంధ అ భివృద్ధి పనులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శని వా రం ఘనంగా శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠా ధిపతి శ్రీ విజ యేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో వేద మంత్రాల సాక్షిగా ఈ నూ తన అధ్యాయం ఆరంభమైంది.ఈ ప్రాజెక్టులతో యాదాద్రి భవిష్యత్ రూపం మారబోతుంద న డoలో సoదేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

    అత్యాధునిక ‘వేద పాఠశా ల’ (రూ. 43.79 కోట్లు)భారతీయ సనాతన ధర్మానికి యాదాద్రి ఇకపై ఒక పెద్ద హబ్‌గా మార బోతోంది. 15 ఎకరా ల సువిశాల విస్తీర్ణంలో 1,40,000 చద రపు అడుగుల భారీ వైశాల్యం తో మూడు దశల్లో ఈ వేద పాఠశా లను నిర్మిoచబోతున్నారు. మొద టి దశలోనే ప్రధా న భవన నిర్మా ణం పూర్తి కానుంది. ఇక్కడ ఒకేసా రి 500 మంది వేద విద్యార్థులు వి ద్యను అభ్యసించే అద్భుత అవ కాశం కలగబోతోందని చెబుతున్నారు.

    విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయి వసతి (Accommodat ion), ని వాస భవనాలు, ఆధునిక డైనింగ్ హాల్‌ను డిజైన్ చేశారు.దీనికి అనుబంధంగానే పక్కనే సర్వపాప హరమైన యజ్ఞశాల, యాగశాలల ను నిర్మిస్తున్నారు.భక్తుల కోసం స రికొత్త సౌకర్యాల హంగులు కొండ పైకి వచ్చే భక్తుల అను భూతిని మ రింత ఆధ్యాత్మికంగా, సుఖవంతంగా మార్చేం దుకు మరికొన్ని కీలక నిర్మాణాలకు పునాది పడింది.

    నిత్య కల్యాణ మండపం (రూ. 9. 86 కోట్లు) కొండపై స్వామి వారి కల్యాణాన్ని వేలాది మంది భక్తులు కనులారా వీక్షించే లా అత్యంత వై భవంగా ఈ మండపాన్ని తీర్చిదిద్ద నున్నా రు.దీక్షాపరుల సదనం(రూ. 43.12 కోట్లు) స్వామివారి మా ల ధారణ చేసే దీక్షాపరుల కోసం ప్ర త్యేకంగా అన్ని వసతు లతో కూడిన భారీ సదనాన్ని నిర్మిస్తున్నారు. అదే సమయం లో వైకుంఠ ద్వారం గుండా కాలినడకన కొండపైకి వెళ్లే భక్తు లకు ఎండ, వానల నుండి రక్ష ణగా అధునాతన పైకప్పు (S helter) రాబోతోంది.

    ఇక మాడవీధుల గుండా రథశాల వైపు వెళ్లేందుకు సులువై న మెట్ల మార్గాన్ని నిర్మించనున్నారు. సరి కొత్త చరిత్రకు సా క్ష్యంగా నిలిచిన ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ము ఖ్యమం త్రితో పాటు శాసన మం డ లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ కు మార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామ ల కిరణ్ కు మా ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, దే వాదాయ శాఖ సెక్రటరీ శైలజ రామ య్యర్, కమిషనర్ హనుమం త రావు, జిల్లా కలెక్టర్ అను రాగ్ జయంతి మరియు పలువురు ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు హా జరై యాదాద్రి నూతన ప్రస్థానానికి సం పూర్ణ మద్దతు ప్రకటించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.