MLC Bomma Mahesh Kumar Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై బి గ్ టివి అసత్య కల్పిత కథనాలను ఖండిస్తూ శనివారం బిగ్ టివి యా జమాన్యం దిష్టిబొమ్మను బీసీ సం ఘాల ఆధ్వర్యంలో దగ్దం చేశారు. బడుగులను అవమానించే బిగ్ టీ వీ ఛానల్ ను తెలంగాణలో బ్యాన్ చేయాలని పిలుపుని చ్చారు. బీసీ లను రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్న అగ్రకుల మీడి యా సంస్థ యాజమాని వెంటనే పిసిసి అధ్యక్షునికి క్షమాపణలు చె ప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ల పై విషం చిమ్ముతూ బిగ్ టీవీ చేసి నటువంటి డిజాస్టర్ పిసిసి అధ్య క్షుడు అని అనడంలో అంతర్యం ఏ మిటని ప్రశ్నించారు.
బీసీలను పార్టీ పదవులలో ప్రభు త్వ పదవుల్లో మానసికంగా ఇబ్బం ది పెడుతూ వ్యక్తిత్వ హననం చే స్తున్న అగ్రకుల మీడియా సంస్థ వెంటనే పిసిసి అధ్యక్షునికి బిగ్ టి వి యాజమాన్యం క్షమాపణలు చె ప్పాలని బీసీ సంఘాల నేతలు, కుందారం గణేష్ చారి,గుజ్జ కృష్ణ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తా టికొండ విక్రమ్ గౌడ్ లు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజా యితీ గల నాయకుడు బొమ్మ మ హేష్ కుమార్ గౌడ్ పై కొంతమంది అగ్రకులాల నాయకులు కొంతమం ది మీడియా సంస్థలు అడ్డం పెట్టు కొని బీసీలను కుట్రలు చేసి వ్యక్తి త్వ హరణం చేసి చిన్నచూపు చూ సే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శని వారం హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తాలో అగ్రకుల మీడియా బిగ్ టీవీ సంస్థ యాజమాన్యం వ నం విజయ రెడ్డి దిష్టిబొమ్మను బీసీ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలు సం యుక్తంగా దగ్ధం చేశారు.
