Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, యువత స్వయం ఉపాధి...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, యువత స్వయం ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణలు

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : యువత స్వయం వారి కాళ్లపై వారు నిలబడేం దుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యత ఇ స్తున్నదని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తెలిపారు. ప్రజా పా లన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా చేపట్టిన యువ జన వారోత్సవంలో యువతకు ప్ర భు త్వం విస్తృత అవకాశాలు క ల్పించిందన్నారు.శనివారం ఉ ద యాదిత్య భవన్ లో సీఎం కప్ క్రీడలలో విజయం సాధించి న క్రీడా కారులకు బహుమతులు ప్రదానం చేసి జాబ్ మే ళా లో ఎంపికైన యు వతకు నియమకాపు ఉత్తర్వులు అంద జేశారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య యువత పెద్ద సంఖ్య లో ఉన్నారని, యువతే దేశానికి గొ ప్ప వనరు అని అన్నారు. యువత స్వయం సమృద్ధిగా నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోంద న్నారు. ఫిట్‌నెస్‌ కు ప్రాధాన్యం పెం చే ఉద్దేశంతో”ఫిట్ తెలంగాణ “కార్యక్రమా న్ని ప్రారంభించామని తెలి పారు.

    నల్గొండలో న్యాక్ సెంటర్,సెట్విన్ సెంటర్ ఇందిరా మహిళా శక్తి కేం ద్రాలను ఏర్పాటు చేసి యువతకు కెరీర్ మరియు నై పుణ్యాభివృద్ధి అ వకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యాపారం ప్రారంభించాలను కునే యువతకు ఎంఎస్‌ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కో ట్ల వరకు ప్రోత్సాహకా లు అందిస్తున్నామని పేర్కొన్నారు.యువత సమాజ అవస రాలను అర్థం చేసుకు ని నిరంతరం నేర్చుకుంటూ ముం దు కు సాగాలని సూచించారు. ము ఖ్యంగా ఫైనాన్స్ డిసిప్లిన్ అవసరమని, ఎంత పొదుపు చేశాం, ఎంత ఖర్చు చేశాం అ నే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రీ డల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థు లు మరింత ఉన్నత స్థా యికి చేరు కోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

    మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చాటింగ్ వంటి వాటిపై సమయా న్ని వృథా చేయకుండా లక్ష్యసాధ నపై దృష్టి పె ట్టాలని సూచించారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లో ఉ న్నట్లు తెలిసినా వెంటనే పోలీసు లకు సమాచారం ఇ వ్వాలని పిలు పునిచ్చారు. అనంతరం సీఎం కప్‌ క్రీడలలో రాష్ట్ర స్థాయిలో తొలిస్థానం సాధించిన హాకీ జట్టును కలె క్ట ర్ అభినందించారు.

    అలాగే కిక్ బాక్సింగ్, అథ్లెటిక్స్, వా లీబాల్, ఫుట్‌బాల్ తది తర క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సత్కరించా రు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వా స్ ,అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అ క్బర్ అ లీ,కోచ్ శంభు లింగం వివిధ కోచ్ లు, విద్యార్థులు త దితరులు పాల్గొన్నారు.

     

    అత్యంత పారదర్శకంగా భూముల మార్కెట్ విలువల సవ రణ ప్రక్రియ

    నల్లగొండ: భూముల మార్కెట్ వి లువల సవరణ ప్రక్రియ ను అత్యంత పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి చంద్ర శేఖర్ అధికారులను తెలిపారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ ను వేగవంతం చేయడం పై హైదరా బాద్ నుండి భూ పరిపాలన ప్రధా న కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమా ర్, అన్ని జిల్లాల కలెక్టర్లు,అదనపు కలె క్టర్లు రెవెన్యూ లతో ఉన్నత స్థా యి వీడియో కాన్ఫరెన్స్ స మావేశాన్ని నిర్వహించారు.

    అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మా ర్కెట్‌లో ఉన్న డి మాండ్‌ను బట్టి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుం డా, అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ సవరణలు ఉంటాయని పేర్కొన్నారు.అంతకుముందు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ మా ట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నా మార్కెట్ డిమాం డ్, వాస్తవ పరిస్థితులకు అనుగు ణంగా మే 28 నాటికి మార్కె ట్ విలువల సవరణ పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు.

    క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ మార్కెట్ ధరలను నిశితంగా పరిశీలించి, ఎలాంటి వ్యత్యా సాలు లేకుండా శా స్త్రీయంగా ఈ విలువలను ఖరారు చే యాలని సూచించారు.రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధి కా రులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా నివేది కలను సిద్ధం చేయాల ని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.