Sunday, September 27, 2026
More
    HomeOpinionChandampet Murder case chasing : చందంపేట హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు 

    Chandampet Murder case chasing : చందంపేట హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు 

    📰 Generate e-Paper Clip

     

    Chandampet Murder case chasing : ప్రజా దీవెన, చందంపేట: చందంపేట మండలంలోని కోరుట్ల సమీపంలో మంగళ వారం రాత్రి హత్య చేసి పక్కా పథకం ప్రకారం ప్ర మాదంగా చిత్రీకరించిన భార్య, ఆమె ప్రియుడు, అక్కలను అరెస్టు చే సినట్లు దేవరకొండ డిఎస్పి ఎంవి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు.

     చందంపేట మండలం బిల్డింగ్ తం డాకు చెందిన రమావత్ నర్సింహ (51) తెల్దేవరపల్లి గ్రామానికి వెళ్లే ర హదారి పక్కన తన మోటార్ సైకి ల్‌తో కిందపడి మృతదేహంగా కని పించా డు. ఈ ఘటనపై సమాచా రం అందుకున్న చందంపేట ఎ స్ఐ లోకేష్ సంఘటనా స్థలానికి చేరు కొని పరిశీలించారు. అనంతరం మృతుడి కుమారుడు రమావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    దర్యా ప్తు ప్రారంభ దశలో ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించిన ప్పటికీ, పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగించా రు. ఈ క్రమంలో మృ తుడి రెండవ భార్య రమావత్ జ్యో తి పై అను మానాలు వ్యక్తమవడంతో శుక్రవారం డిండి సీఐ బీ సన్న కే సును తదుపరి విచారణ నిమిత్తం స్వీకరించి జ్యోతి ని విచారించారు.

    విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని, రమా వ త్ జ్యోతి తన అక్క రమావత్ ల క్ష్మి, తన ప్రియు డు నేనావత్ రా జుతో కలిసి ముందస్తు పథకం ప్రకారం హ త్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులు ముగ్గురు కలిసి ర మావత్ నర్సింహను ఎస్‌ఎల్‌బీసీ క్యాంపు నుండి తెల్దేవర పల్లి గ్రామా నికి వెళ్లే రహదారి సమీపంలోని కోరుట్ల శివారు కు తీసుకెళ్లారు.

    అక్క డ మృతుడికి మద్యం తాగించి, అ నంతరం అతని నోరు మరియు ముక్కు మూసి హత్య చే శారు. త ర్వాత ఈ ఘటనను రోడ్డు ప్రమా దంగా చిత్రీకరిం చేందుకు మృతు డి ని అతని మోటార్ సైకిల్ పక్కన ప డ వేసి సీన్ క్రియేట్ చేశారు. అంతే కాకుండా, మృతుడు గతం లో మోటార్ వా హనాల బ్యాటరీల దొంగత నాలకు పాల్పడే వాడని, అతని పై దేవరకొండ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్న విష యాన్ని ఉపయోగించుకొని, ఘటన స్థలంలో ట్రాక్ట ర్ బ్యాటరీ మరి యు పానర్‌ను ఉంచి, మృతుడు దొంగతనా నికి వెళ్లి వస్తూ ప్రమాదా నికి గురైనట్లు నమ్మించే ప్రయత్నం చేశారు.

    పోలీసులు సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలిక లు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ ను వేగవంతం చేయగా, నిందితు ల కుట్ర బయటపడింది. అనంత రం నిం దితులైన రమావత్ జ్యోతి, రమావత్ లక్ష్మి మరియు నేనా వత్ రాజును అదుపులోకి తీసుకొని వి చారించగా హత్య జరిగిన విషయా న్ని అంగీకరించారన్నారు.

    ఇదిలా ఉండగా ఒక మోటార్ సైకిల్ రెండు మొబైల్ ఫోన్లు ఒక ట్రాక్టర్ బ్యాట రీ పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసులో దేవర కొండ డీఎస్పీ పర్యవేక్షణలో డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్ఐ లోకేష్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పీసీలు లచ్చు, నర సిం హ, హెచ్‌జీ లు యాదయ్య, రాందా స్ తదితర పోలీసు సి బ్బంది సమర్థ వంతంగా ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినం దించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.