Wednesday, September 30, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల లో కాంగ్రెస్ జెండా...

    Minister Komatireddy Venkat Reddy : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల లో కాంగ్రెస్ జెండా ఎగరాలి 

    📰 Generate e-Paper Clip

    — రూ. 2,200 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు

    –నల్లగొండను అభివృద్ధి చేసింది నేనే, చేసేది నేనే

    –రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖా మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు అధిక నిధు లు తీసుకువచ్చి మరింత అ భివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవ నాలు,గ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నా రు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చే సే పలువురి అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. ఈ సం దర్భంగా కార్పొరేషన్ లోని 6 వ డివిజన్లో ఎన్నికల ప్రచారా నికి శ్రీకారం చుట్టి 25, 41,19 డివిజన్ లో నిర్వహించిన కా ర్యక్రమాలలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే కా ర్పొరేషన్ ఎన్నికలలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. మున్సిపల్ కార్పొ రేష న్ లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలి పిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

    తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గె లిపించిన ఇక్కడి ప్రజల రుణం తీ ర్చుకోలేనిదని మంత్రి అన్నారు.పేద ప్రజలకు ఏ ఆపద వచ్చిన తా ను అండగా ఉంటానని స్పష్టంచేశారు . పదేళ్లు అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూ న్యమని విమర్శించారు. ఆ పార్టీని ప్ర జలు ఎప్పుడో బొంద పెట్టారని ఎ ద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన త ర్వాత అభివృద్ధి వే గవంతంగా జరుగుతుందని తెలిపారు.

    నల్గొండ మున్సిపాలిటీలో రూ.2, 200 కోట్లతో అభివృద్ధి ప నులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ మున్సి పా లిటీని కార్పొరే షన్ గా చేయడంతో మరింత అభి వృద్ధి జరు గుతుంది. అన్ని డివి జన్లోని సమస్యలు లేని కాలనీలుగా తీ ర్చిదిద్దుతానని తెలిపారు.

    ఇప్పటికే కోట్లాది రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు ప నులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని డివి జన్లలో ప్రతిరోజు తాగునీరు వచ్చే విధంగా చర్యలు చేపడు తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్ర జలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన త ర్వాత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిం దని అన్నారు.

    మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అ భివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.ఇప్పటికే పలు చోట్ల పెట్రోల్ బం కులు, రైస్ మిల్లులు మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిం దని మంత్రి అన్నారు. ఈ కార్య క్ర మంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, న ల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బు ర్రి శ్రీనివాస్ రె డ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి ర మేష్, డిసిసిబి మాజీ డైరెక్టర్ పా శం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూల కం టి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్ రె డ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, గోగుల గ ణేష్, లోకేశ్వరి రెడ్డి, కత్తుల వెంకట్ ,విక్రం రెడ్డి, అన్వర్, ఎండి హఫీజ్, అఙ్గర్, మేడోజు శ్రీనివాస్, జగాల్ రెడ్డి వెంకట్ రెడ్డి త దితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.