Monday, September 28, 2026
More
    HomeOpinionChairman Gutta Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలక...

    Chairman Gutta Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలక వ్యాఖ్య, జమిలిఎన్నికల దిశలో తెలంగాణ రాజకీయాలు, మహిళా రిజర్వేషన్ లు అమలు

    📰 Generate e-Paper Clip

    Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశా రు. తెలంగాణ రాజకీయాల్లో ఆస క్తికర పరిణామాలకు తెరలేపుతూ శాసనమండలి ఛైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలే జరిగే అవకాశ ముందని ఆ యన వెల్లడించారు. అప్పటికి నియోజకవర్గాల పునర్వి భ జన పూర్తవుతుందని, అదే స మయంలో మహిళా రిజర్వే షన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశ ముందని పేర్కొన్నా రు.

    బుధవారం శాసనమండలి పునర్నిర్మాణ పనులను అధి కా రులతో కలిసి పరిశీలించిన ఆయన, అనంతరం మీడియా తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయని, మళ్లీ అధికారంలోకి వస్తామన్న వారు కూడా ఇప్పుడు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యా నిం చారు. ప్రజాపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారనని గుర్తు చేశారు.

    వ్యక్తిగత రాజకీయాలపై స్పందిస్తూ తన కుమారుడు అ మి త్ రెడ్డికి అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశ ముం దని చెప్పారు. తాను మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరం గా ఉంటానని మరోసారి అవకాశం దొరికితే శాసనమండలిలోనే కొ న సాగుతానని స్పష్టం చేశారు. ఇక శాసనసభ ప్రాంగణ అభివృద్ధి ప నులపై కూడా ఆయన వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని ఈ నెల 8న శాసనమండలి హాల్ ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు.

    అదే రోజుకు తెలంగాణ తల్లి విగ్రహం తయారీ పూర్తయితే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అదే స మయంలో ఆదర్శనగర్‌లో 9ఎకరాల భూమిలో కా న్స్టి ట్యూషన్ క్లబ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నా యని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.కాగా తాజాగా శా సన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన తెలంగాణ రాజకీయాల్లో ముందున్న ఎన్నికలపై ఈ వ్యాఖ్యలు కొత్త చ ర్చలకు దారితీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తు న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.