Sunday, September 27, 2026
More
    HomeOpinioncyclone montha tracker : నల్లగొండజిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్పీల్, మొంతతుఫానుతో రైతులు, ప్రజలు...

    cyclone montha tracker : నల్లగొండజిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్పీల్, మొంతతుఫానుతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    📰 Generate e-Paper Clip

    నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్పీ ల్, మొంతతుఫానుతో రైతులు, ప్ర జలు అప్రమత్తంగా ఉండాలి

    –తడిసిన దాన్యాన్ని కొనుగోలు కేం ద్రాలను తీసుకురావద్దు
    –విద్యుత్తు ప్రమాదాలు జరిగేం దు కు ఆస్కారం ఉన్న లోతట్టు ప్రదేశా లకు ప్రజలు వెళ్ళోద్దు

    cyclone montha tracker : ప్రజా దీవెన నల్లగొండ:రానున్న రెం డుమూడు రోజుల్లో “మొంత” తు ఫాన్ ప్రభావం నల్గొండ జిల్లా లో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి కోరా రు. ఈ విష యంపై ప్రజలను అప్రమత్తం చేయా ల్సిందిగా ఆమె అధికారులు ఆదే శించారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబం ధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

    రానున్న 2,3 రోజులు రాష్ట్రంలోని 6 జిల్లాలో ” మొంత” తుఫాను కార ణంగా ఒక మాదిరి వర్షాలు మొద లుకొని, భారీవర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హె చ్చరికలు జారీ చేసిందని, అందులో నల్గొండ జిల్లా కూడా ఉందని, అం దువల్ల జిల్లాలోని లో తట్టు ప్రాంతా లలో కిందికి వేలాడే విద్యుత్ వైర్లు , వంగిన విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫా ర్మర్ల వల్ల ప్రమాదం ఉన్నందున వ ద్దకు ప్రజలు, అప్రమత్తంగా ఉండా లని చెప్పారు.

    రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రా ల కు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థి తుల్లో తీసుకురావద్దని విజ్ఞప్తి చేశా రు. రానున్న మూడు రో జులు త హసిల్దారులు వారు పని చేసే కార్య స్థానాలలోనే ఉండా ల ని, ఒకవేళ ఇదివరకె సెలవు దరఖాస్తు చేసి ఉంటే సెలవులన్నీ ర ద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల నుండి వెంటనే మిల్లుకు పంపించాలని ఆదే శించారు.

    తహసిల్దార్లు వారి పరిధిలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చే యడమే కాకుండా,నాణ్యత కలిగిన ధాన్యాన్ని మిల్లులకు తర లించేందు కు లారీలను సిద్ధం చేసుకోవాలని, ఈనెల 27 మధ్యా హ్నం నుండి పూ ర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ నాణ్యత ప్ర మాణాలతో వచ్చిన ధా న్యాన్ని సెంటర్లలో ఉండకుండా తక్ష ణమే పంపించాలని ,ఇందుకు సం బంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆదే శించారు.

    “మొంత” తుఫాను తీవ్రతను దృష్టి లో ఉంచుకొని ధాన్యం తడవ కుం డా ఉండేలా గ్రామ పాలనాధికారు లు, ధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏజె న్సీలు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొ నుగోలు కేంద్రాల నిర్వహకులు ధా న్యం సేకరణ పట్ల నిర్ల క్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుం డా, సస్పెండ్ చేయడం జరుగుతుం దని హెచ్చరించారు. కొన్న ధాన్యా నికి సంబం ధించి ట్యాబ్ ఎంట్రీ ఎప్ప టికప్పుడు చేయాలని చెప్పారు.

    జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,మిర్యాలగూడ సబ్ కలెక్ట ర్ నారాయణ అమిత్ ,నల్గొండ ఆర్డీ వో వై. అశోక్ రెడ్డి ,డిఆర్డి ఓ శేఖర్ రె డ్డి, డి సి ఓ పత్యా నాయక్, మార్కె టింగ్ ఏ డి ఛాయ దేవి తదితరులు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.