Wednesday, October 7, 2026
More
    HomeOpinionExiseDepartment WinesTenders : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజురూపేనా రూ. 147కోట్ల 18...

    ExiseDepartment WinesTenders : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజురూపేనా రూ. 147కోట్ల 18 లక్షల ఆదాయం

    📰 Generate e-Paper Clip

     

    ExiseDepartment WinesTenders:  ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జి ల్లాలో సోమవారం మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా, విజయవంతంగా ని ర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 2025 -27 సంవత్సరానికి సం బంధిం చి జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు వచ్చిన 4906 దర ఖాస్తు ల నుండి లక్కీ డ్రా ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వ హించారు.

    ఈ సందర్భంగా ఒక్కో షాపుకు లక్కీ డ్రాను తీసి దుకాణదారులను ఎంపిక చేశారు. ఈ సం దర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా క లెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని మొత్తం 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చా యని తెలిపారు. ప్రభుత్వానికి దర ఖా స్తుల ఫీజు రూపేనా 147 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వ చ్చిందని వెల్లడించారు.

    రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తులలో జిహెచ్ ఎంసి తర్వాత నల్లగొండ జిల్లా రెండవ స్థానాన్ని పొందిందన్నారు. మద్యం దు కాణాల ఎంపిక ప్రక్రియ కార్యక్రమం మొత్తాన్ని వీడియోగ్రఫీ ద్వా రా రికార్డు చేయడం జరిగిందని, మద్యం దుకాణాలకు ఎంపికైన వా రు సంవత్సరం లైసెన్స్ ఫీజులో 1/6 వ వం తు ఈనెల 28 లోగా చె ల్లించాలని చెప్పారు. మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని పూ ర్తి చేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపడo జరుగు తుందని ఆమె వెల్లడించారు.

    ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి 34 మ ద్యం దుకాణాలు, ఎస్సీలకు 14ఎస్టీలకు 4దుకాణాలను కేటా యిం చడం జరి గిందని ఎక్సయిజ్ సూపరింటిం డెం ట్ సంతోష్ తెలిపా రు.ఈ కార్యక్ర మంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఎక్సైజ్ అధి కారులు, తదిత రులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.