Monday, September 28, 2026
More
    HomeOpinionFetal road accident in vadapalli : బిగ్ బ్రేకింగ్, వాడపల్లి రహదారిపై మృత్యుఘోష, రెండు...

    Fetal road accident in vadapalli : బిగ్ బ్రేకింగ్, వాడపల్లి రహదారిపై మృత్యుఘోష, రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురి ప్రాణాలు బలి

    📰 Generate e-Paper Clip

     

    Fetal road accident in vadapalli : ప్రజా దీవెన, మిర్యా లగూడ: అది ఎప్పటిలాగే సాగిపోతున్న ఒక సాదాసీదా మంగళవారం. ఎవరి పను ల్లో వారున్నారు ఎవరి ప్రయాణా ల్లో వారు సాగిపోతున్నారు. కానీ, విధి మరోలా తలచింది. మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి రహదారి ఒక్కసారి గా రక్తసిక్తమైంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఒక ఘోర ప్ర మాదం మూడు కుటుంబాల్లో ఎప్పటికీ పూడ్చలేని తీవ్ర వి షాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొ న్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.అత్యంత హృదయ విదారకమైన దుర్ఘటనకు సంబంధించి పూర్వపరాలు ఇలా ఉన్నాయి.

    పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లికి చెందిన ధనుంజయ్ రావు, నరసింహారావు ఇద్దరూ ఒకే బైక్‌ పై దామరచర్లవైపు బయలుదేరారు. మరోవైపు, దాచే పల్లికి చెందిన డెక్కా వెంకటేశ్వర్లు తన బైక్‌పై ఎదురుగా వస్తున్నా డు. సరిగ్గా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేసరికి ఊహించని వి ధంగా రెండు వాహనాలు బలంగా ఒకదానికొ కటి ఢీకొన్నాయి.

      ఆక్షణం అక్కడoతా అంధకారం

    ఢీకొన్న వేగానికి బైక్‌లు రెండూ నుజ్జునుజ్జయ్యాయి. ఆ శబ్దా నికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ధనుంజయ్ రావు తలకు తీ వ్ర గాయంకావడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. నెత్తురో డుతున్న మిగతా ఇద్దరిని చూసి స్థానికులు చలించిపోయా రు. ఘటన జరిగిన వెంటనే స్థాని కులు స్పందించి, తీవ్రంగా గా య పడిన నరసింహారావు, వెంకటేశ్వర్లును అత్యవసరం గా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని కాపాడటాని కి శతవిధాలా ప్రయ త్నించినప్పటికీ, ఫలితం లేకపో యిం ది. చికిత్స పొందుతూ వారిద్ద రూ కూడా తుదిశ్వాస విడిచా రు.

    సమాచారం అందుకున్న వెంటనే వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. మృతదేహా లను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తర లించి, కేసు నమోదు చే సి దర్యాప్తు ప్రారంభించారు. ఇది లా ఉండగా కేవలం కొద్ది నిమిషా ల వ్యవధి మూడు ప్రా ణా లు గాల్లో కలిసిపోయాయి. ఈ వార్త తెలియగానే బాధిత కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఊ రంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. రహదా రులపై పెరుగుతున్న వేగం, అజాగ్రత్తే ఇలాంటి ప్రమాదాలకు కారణమ వుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ప్రయాణాల్లో క్షణకాలం నిదానిస్తే ఇరుపక్షాల కుటుం బాలకు కొండంత అండ మిగులుతుందని ఈ ఘోర కలి అవ గతం చేస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.