Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎ నుముల రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్య మంత్రివా, లేక వీధి రౌ డీవా అని అ డుగుతున్నా, అవ్వతాతలు రూ. 4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావని అడి గితే లాగుల తొండలు వదులుతా అంటావా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హ రీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. బాండ్ పేపర్లు రాసి చ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా, ఆడబిడ్డలు మహాల క్ష్మి రూ. 2500 అడిగితే ‘పేగులు తీ సి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయి జం సాగదు ఖబర్దార్ అంటూ హె చ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతా మనే భయం తో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలో భపెట్టి పార్టీలు మారుస్తు న్నారని ఆరోపించారు. మెదక్ ము న్సిపల్ ఎన్నికల సన్నాహక సమా వేశంలో ఆయన మాట్లా డుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భా ష పై, పాలనపై తీవ్ర స్థాయిలోఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీ ష్ రావు చేసిన వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే…తెలంగాణ కోసం డి ప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా మ హనీయుడు కేసీ ఆర్.కెసిఆర్ చెబితే మేము కూడా పద వు లకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టి నం. మరి నువ్వు? రాజీనామా చే యమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారు ల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహి వి. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలం గాణ తెచ్చారు కాబట్టే ను వ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉ న్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగు లు మోసు కుంటూ బతికేవాడివి.కాంగ్రెస్ పా ర్టీకి గెలిచే స త్తా ఉంటే మా అభ్య ర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జ నం మీకు ఓటు వేయరని అర్థమై పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు.
ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకు పోతున్నా రో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వ చ్చినప్పుడు వడ్డీతో స హా చెల్లిస్తాం.ఇప్పటివరకు రైతు బం ధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడ కపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. ని న్ను చీరిచింతకు చెండాడుతారు. రుణమాఫీ పేరు తో దేవు ళ్లనే మోసం చేసిన ఘను డివి నువ్వు. నీ అబద్ధాలను రైతు లు నమ్మే స్థితిలో లేరు.
మెదక్ జిల్లా కల నెరవేర్చింది కేసీ ఆర్. ఇక్కడికి కలెక్టర్ ఆఫీ సు, ఎస్పీ ఆఫీసు, రైలు, నాలుగు లైన్ల రోడ్డు తెచ్చింది కేసీ ఆర్. ఘనపూర్ ఆయ కట్టుకు నీళ్లు ఇచ్చింది మేము. సిద్ది పేటతో సమానంగా మెదక్‌ను అభి వృద్ధి చేశాం. కాంగ్రెస్ వచ్చాక ఇక్క డ ఒక్క రూపాయి పని జరగలేదు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హ క్కు కాంగ్రెస్‌కు లేదు.ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ హరీ ష్ అన్న ఉన్నాడు. నేను చూసు కుంటా. కాంగ్రెస్ గుండా రాజకీయా న్ని, మోసాలను ఎండగట్టండి.బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చా రు. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్య ర్థులను గెలిపించండి. మెదక్ అభివృద్ధిని కొనసాగిద్దామని హరీష్ రావు పునరుద్ఘాటించారు.
