EXMinister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వం చేతకాని తనం ఓ వైపు, ప్రకృతి ప్ర కోపం ఓ వైపు అన్నదాతలు పుట్టె డు దుఃఖంలో విలవిలలాడుతు న్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటు వ్యా ఖ్యలు చేశారు. జిల్లాలో ఎక్కడ చూ సినా హృదయవిధారక దృశ్యాలే క నిపిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళనకు గురవుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల భావి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రం వ ద్ద తడిసిన ధాన్యాన్ని శనివారం ఆ యన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి పరి శీలించి, రైతులను పరామర్శించా రు.
నల్లగొండ జిల్లా మంత్రులు అడ్డ గో లు కమిషన్లు, అక్రమ సంపాదన మీ దనే దృష్టి సారించారని ఆరోపించా రు.విదేశీ టూర్లల్లో జల్సాలు చేస్తు న్నారని, దోచుకోవడం మీదనే వారి దృష్టి అంతా అంటూ ధ్వజ మెత్తా రు. రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపా య లు లంచాలు మింగి వారికి సాగిల పడ్డారని, మంత్రుల దుర్బుద్ధి కార ణంగా ఫలితంగా మిల్లర్లు రైతులను పీక్కుతింటున్నారని విమర్శించారు.
ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతుందని, పత్తి రై తుల పరిస్థితి మరీ దారుణంగా ఉం దని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వు న్నప్పుడు నిబంధనలు అన్ని పక్క న పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ధాన్యాన్ని పత్తిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు.
ప్రస్తుతం మరి ఇప్పుడున్న ప్రభు త్వం రైతులను ఎడిపిస్తున్నదని విమర్శించారు.
యూరియా కొరతతో కొన్ని రోజులు ఏడిపించిన ప్రభుత్వం, ప్రస్తుతం ధా న్యం కొనక ఎడిపిస్తున్నదని, తుఫా న్ తో నష్టపోయిన పంటలకు నష్టప రిహారం వెంటనే అందించాలని డి మాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాల ని, లేదంటే బిఆర్ఎస్ పార్టీ తరఫు న ప్రభుత్వంను నిలదీసేందుకు సి ద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతు లు కూడా బయటికి వచ్చి మంత్రు లను, ఎమ్మెల్యేలను వెంటపడి నిల దీయాలని, ఎక్కడికక్కడ ప్రశ్నించా లని తిరుగుబాటు చేస్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
వారి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికా ర్జు న రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడ ర్ అభిమన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ జెడ్పిటిసిలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, మాజీ కౌన్సి లర్ లు రావుల శ్రీనివాసరెడ్డి, మార గొని గణేష్, పెరిక యాదయ్య, రా మ్ రెడ్డి, బీపంగి కిరణ్, రాపోలు వెంకటేశ్వర్లు, కొమ్ముగిరి, తదితరు లు వెంట ఉన్నారు.
BRS leader, ex minister guntakandla jagadish reddy hot comments on government and ministers pic.twitter.com/yT1rn7UCWN
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) November 1, 2025
