GHMC Officials ACB Arrest : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగా ణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ అధి కారులు తమ కొరడా జూలిపిస్తూనే ఉన్నారు. ఇటీవల కా లంలో ఏసీబీ అధికారులు దాడు లను నిత్యంకృత్యం కాగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కేసులు న మోదు అవుతూనే ఉన్నాయి. తా జాగా బుధవారం హైదరాబాద్ లోని బండ్ల గూడలో గల డిప్యూటీ వి ద్యా కార్యాలయం పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్ కార్యాలయంలో ఫిర్యాది నుండి అధి కారిక సహాయం చేయడoలో భాగంగా పాఠశా లను ఎస్ఎస్సి బోర్డు పరీక్షా కేంద్రాల జాబితా నుండి తొ లగించకుండా ఉండటానికి రూ.10 ల లంచం డిమాండ్ చేసి స్వీకరి స్తుండగా సిటీ రేంజ్-II యూనిట్ ఏ సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏఓ సూచన మేరకు అతని వద్ద నుండి రూ. 10 వేలు లం చo సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఏఓ అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన విధులను సక్రమం గా నిజాయితీగా నిర్వర్తించలేదు. దాంతో ఏఓను అరెస్టు చే సి న్యాయ విచారణ నిమిత్తం నాంపల్లిలోని అదనపు ప్రత్యే క న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామన్నారు.
జీహెచ్ఎంసి ఎస్ఈ, కంప్యూ టర్ ఆపరేటర్ అరెస్ట్….
జీహెచ్ ఎంసి కూకట్ పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, కం ప్యూటర్ ఆపరేటర్ బుధవారం ఏ సీబీ వలలో చిక్కారు. బుధవారం కూకట్ పల్లి జోన్ పరిధిలోని ఇంజ నీరింగ్ కా ర్యాలయంలో సూపరిం డెంట్ ఇంజనీర్ గా పొద్దుటూరి చి న్నారెడ్డి అధికారిక సహాయం చేయ డoలో బాగంగా ఫిర్యా దిదారుడు పూర్తి చేసిన పనులను తనిఖీ చేసి అతని రూ. 1.40 లక్షలు విలువైన బిల్లులను ఆమోదం కోసం జోనల్ కమిషనర్‌కు పంపడానికి, ఫిర్యాది దారుడి నుండి రూ.15 లక్షల లం చం డిమాండ్ చేసి తన కార్యాలయంలో ఏఓ-2 శ్రీ బాలాసాని ప్రవీ ణ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ (అవు ట్సోర్సింగ్), సూపరింటెం డింగ్ ఇంజనీర్ కార్యాలయం జో నల్ కమిషనర్, కూకట్పల్లి జోన్, జిహెచ్ఎంసి ద్వారా స్వీక రిస్తుండగా ఏసీబీ, రంగారెడ్డి రేంజ్ అధికారులు పట్టుకు న్నారు.
లంచంగా తీసుకున్న రూ. 15 లక్ష ల సొమ్మును ఏఓ-2 వద్ద నుండి అ తని సూచన మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, ఏఓ-1 ఏఓ-2 అక్రమ ప్రయోజనం పొంద డం కోసం తమ విధులను సక్రమం గా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, ఏఓ-1 ఏఓ-2లను అరెస్టు చేసి, జ్యుడీషి యల్ రిమాండ్ కోసం నాంపల్లి లో ని మొదటి అద నపు స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కేసు ద ర్యాప్తులో ఉన్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది దారుడి వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డి మాండ్ చేస్తే, చట్ట ప్రకా రం చర్య తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబ ర్ 1064కు సంప్రదించాలని ప్రజల కు విజ్ఞప్తి. ఏసీబీ తెలంగాణను వా ట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) వంటి సోషల్ మీ డియా ప్లాట్‌ఫా మ్ల ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఏసీ బీ తెలంగాణను సంప్ర దించడానికి అన్ని ప్రభుత్వ కార్యా లయాలలో మరియు ప్రముఖ బ హిరంగ ప్రదేశాలలో ఏసీబీ యొక్క క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడింది. బాధితుడు, ఫిర్యా దిదారుడి పేరు వివరాలు గోప్యంగా ఉంచ బడతాయని ఏసీ బీ అధికారులు తెలిపారు.

