heartwarming case mother SaudiArabian : ప్రజా దీవెన, సౌదీ: నేటి కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను భారంగా భావించి, అనాథాశ్ర మాల్లో వదిలేసే వార్తలు మనం ని త్యం చూస్తూనే ఉంటాం. కానీ, సౌదీ అరేబియా లోని రియాద్ హైకోర్టు లో చోటుచేసుకున్న ఒక సంఘటన కళ్లు తెరిపించేలా, గుండెలను కది లించేలా ఉందంటే అతిశ యోక్తి కాదు. ఆస్తి కోసం కొట్లాడుకునే అన్నదమ్ములను చూ శాము కానీ,తల్లిని తమ వద్దే ఉంచుకోవాలని కోర్టు మెట్లు ఎ క్కిన ఇద్దరు వృద్ధ సోద రుల కథా కమామీషు ఇలా ఉంది.
రియాద్ హైకోర్టులో ఒక విచిత్రమైన కేసు విచారణకు వచ్చిం ది. పిటిషనర్ల వయస్సు చూసి జడ్జి ఆశ్చ ర్యపోయారు. ఒక రికి 80 ఏళ్లు కా గా మరొకరికి 70 ఏళ్లు. ఆస్తి గొడవ అనుకు ని ఫైళ్లు తిరగేసిన జడ్జికి, కేసు అసలు ఉద్దేశ్యం తెలిశాక ది మ్మతిరిగిందని చెప్పవచ్చు. గత 4 0 ఏళ్లుగా 110 ఏళ్ల వృ ద్ధురాలైన తల్లి, తన పెద్ద కొడుకు దగ్గరే ఉంటూ వస్తోంది. అ తడు కంటికి రెప్పలా తల్లిని కాపాడుకుంటున్నాడు.
అయితే, చిన్న కొడుకు బాధ వేరు. తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాలుగా వేడుకుంటున్నా అన్న ఒప్పుకో వడం లేదు. చివరకు గత్యంతరం లేక తమ్ముడు కోర్టును ఆ శ్రయించాడు. కోర్టులో ఉద్వేగభ రితమైన సన్నివేశంగా నిలి చింది. జడ్జి ఇద్దరినీ పిలిచి రాజీ పడమని కోరారు. కానీ, ఇ ద్దరూ తగ్గేదే లేదన్నారు.
“తల్లి నా దగ్గరే ఉండాలి” అని ఇద్ద రూ మొండిగా పట్టుబ ట్టారు. గొడ వ తేలక, చివరికి స్ట్రెచర్‌పై తల్లిని కోర్టుకు తీసు కొచ్చారు. జడ్జి ఆ త ల్లిని అడిగారు, “అమ్మా! ఎవరి దగ్గ ర ఉండాలని ఉంది?” అని. అప్పు డు ఆ వృద్ధురాలి సమాధా నం అందరినీ నిశ్చేష్టులను చేసింది. నాకు ఇద్దరు కొడుకులు సమానమే. ఏ ఒ క్కరి మనసును నేను గాయపర చ లేను. మీరే నిర్ణయం తీసుకోండి, మీరు ఎక్కడికి పంపితే అక్కడికే వెళ్తాను అనడం కొసమెరుపు.
ఇక కోర్టు ఇద్దరు సోదరుల ఆరోగ్య పరిస్థితిని, ఇతర పరిస్థి తులను పరిగణనలోకి తీసుకున్న జడ్జి, తల్లిని తమ్ముని వ ద్ద ఉండాలని తీర్పు నిచ్చారు. కోర్టు తీర్పు వినగానే ఆ పెద్ద న్న ఒక్కసారిగా అక్కడే కుప్ప కూలిపోయాడు. అది ఓటమి వల్ల కలిగిన బాధ కాదు, తల్లికి దూరమ వుతున్నానన్న వేద న కావడంతో నే. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పోషించలేక వేధించే వారు, వృద్ధాశ్రమాలకు తరలించే వారు ఈ ఉ దం తం నుండి పాఠం నేర్చుకోవాలి.
తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందన్నది కేవలం మాటలకే పరిమితం కాకూడ దు. నేటి సమాజంలో విలువ లు కరువవుతున్న తరుణం లో, మన పిల్లలకు చిన్న ప్పటి నుండే తల్లిదండ్రుల పట్ల ఉం డాల్సిన గౌరవప్రదమైన ప్రేమ ను నే ర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ అపురూ పమైన సంఘట నమానవత్వా నికి, మాతృప్రేమకు నిదర్శ నంగా నిలిచిందని చెప్పవచ్చు.
