Monday, September 28, 2026
More
    HomeOpinionITMinister DuddillaSridharBabu మంత్రి శ్రీధర్ బాబు కీలకప్రకటన, తెలంగాణలో నిర్మాణరంగ వృద్ధిరేటు 11.97 శాతం

    ITMinister DuddillaSridharBabu మంత్రి శ్రీధర్ బాబు కీలకప్రకటన, తెలంగాణలో నిర్మాణరంగ వృద్ధిరేటు 11.97 శాతం

    📰 Generate e-Paper Clip

    మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన, తెలంగాణలో నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97 శాతం

    ITMinister DuddillaSridharBabu: ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణలో ‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, 11. 97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ. 80వేల కోట్లకు పైగా స మకూర్చిందని స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉందని రాష్ట్ర ఐటీ, ప రిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నేషనల్ రి యల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(నారెడ్కో) తెలంగాణశాఖ ఆ ధ్వర్యంలో హైటెక్స్ లో ని ర్వహిస్తున్న 15వ నారెడ్కో తెలంగాణ ప్రా పర్టీ షోలో ఆయన ఆదివారం పాల్గొని ప్రసంగించారు.

    హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2 024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజి స్ట్రేషన్ జ రిగిందని, ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలు వైన 6612 ఇ ళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధి కం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యిందన్నారు. ఇవి కేవలం గణాంకాలు కా దని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదే ల య్యిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధా నాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

    ‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటి పైన వి లువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 1 51 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వా టానే 53 శాతం’ అని చెప్పారు. ‘భా రత్ లో వ్యవసాయం తర్వాత ఎ క్కువ మంది రియల్ ఎస్టేట్ రంగం లోనే ఉపాధి పొం దుతున్నారు. అ యితే అభివృద్ధి చెందిన దేశాల జీ డీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా చైనాలో అత్యధి కంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే కాగా ఇ ది మరింత పెరగాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు.

    ‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ –2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూ సీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల తో తె లంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టు దలతో ఉన్నామన్నారు. అక్కడే 200 ఎ కరాల్లో అంతర్జాతీయ ప్ర మాణాలతో అభి వృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నె లల్లోనే భూమి పూజ చేయబోతున్నామని వివరించారు.

    రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెము క గా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రం గా నికి ప్రభుత్వం తరఫున అన్ని వి ధా లుగా అండగా ఉంటా మని హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలం గాణ ప్రతి నిధు లు విజయసా యి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా. లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.