Legislative Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, దేవ రకొండ: విద్య పైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గు రువారం అయన నల్గొండ జి ల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లేపల్లి శి వారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రె సిడెన్షియల్ పాఠశాల ని ర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన, భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యా నికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నద ని, పేదలకు వీటిని అం దించేందుకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళుతున్నదని, ఇందులో భాగంగానే నియోజక వర్గాని కి ఒకటి చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్సియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిం చడం జరిగిందని, 29వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, 18 లక్షల 50 వేల మంది విద్యార్థులు చదు వు తున్నారని తెలిపారు. పేద వి ద్యార్థులకు విద్యతోపాటు, అ న్ని ఉచితంగా అందించాల్సిన అవస రం ఉందని, ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి సా ధ్యమవుతుందని తెలిపా రు. గతంలో తాను ఎం పీగా ఉన్న సమయంలో దేవరకొం డ కు తాగు,సాగునీటి సౌకర్యాలకు కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగం, పెళ్లిపాకల రి జర్వాయర్ ,నక్కలగం డి, డిండి ప్రా జక్ట్ కింద చింతపల్లి, గోపనపల్లి రిజర్వాయ ర్లు,18 కిలోమీటర్ల లింక్ కెనాల్ పూర్తి చేయాల్సిఉందని, దీని ద్వారా మూడులక్షల ఎకరాల కు సాగునీరు వస్తుందని, డిం డి ప్రాజెక్టు పూర్తి అయితే రానున్న రెం డే ళ్లలో దేవరకొండ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని చెప్పా రు. నియో జకవర్గానికి సం బంధిం చిన అన్ని సమస్యల పరిష్కారా నికి తాను ముందుంటానని, పెల్లి పాకల,అన్ని ప్రాజెక్టులు పూర్తి చే సేందుకు అన్ని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పా రు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమా జం బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని, భావించి రాష్ట్ర ప్రభుత్వం 200 కో ట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో కులమతాలకు అ తీతంగా 2563 మంది విద్యా ర్థులు ఒకే చోట చదువుకునే విధం గా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్న దని చెప్పారు. కొండమల్లేపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రా క్టర్ ను ఆదేశించారు.
పేమెంట్ లకు ఎలాంటి ఇబ్బంది లే దని, నల్గొండలో నిర్మిస్తు న్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాలకు ఇప్పటివరకు 20 కో ట్ల రూపాయలు చెల్లించినట్లు ఆ యన తెలిపారు .దీంతోపాటు, తె లంగాణ పబ్లిక్ స్కూల్ ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతున్నద ని, ఈ పాఠశాలకు ప్రై వేట్ పాఠశా లల మాదిరిగా బస్సులను విద్యా ర్థుల ఇళ్ల వ ద్దకు పంపించి బస్సుల ద్వారా వారిని పాఠశాలకు తీసు కు వచ్చి తిరిగి ఇళ్ల వద్ద దింపడం జ రుగుతుందన్నారు. అవస రమైన చోట దశలవారిగా పాఠశాలలను కట్టించడం జరుగు తుందని అన్నారు.
నెరేడుగొమ్ములో 132/1kv సబ్ స్టేషన్ ప్రాధాన్యతను దృష్టి లో ఉంచుకొని మంత్రి ట్రాన్స్కో సీఎండితో ఫోన్లో మాట్లాడి మంజూరు చేస్తున్న ట్లు ప్రకటించారు. నల్గొండ నుండి డిండి వరకు 324 కోట్ల రూపాయ లతో నాలుగు లైన్ల రహదారి ని ర్మిస్తున్నామని, దేవరకొండ నియోజక వర్గం లో 74 కోట్ల రూ పాయలతో కొన్ని రోడ్లను చేపట్టడం జరుగుతున్నదని తెలి పారు. ఆరోగ్యశ్రీ కింద ఎల్ఓసి ఇప్పించడం జరుగుతున్న దని , దేవరకొండ నియోజకవర్గం లో ఆరోగ్యశ్రీ కింద పది కో ట్ల రూపాయలు ఇచ్చినట్లు మంత్రి తెలిపా రు. ఆర్ అండ్ బి శాఖ ద్వారా ర హదారుల నిర్మాణానికి 13 వేల కోట్ల రూపా యలతో టెండర్లు పిలవ డం జరిగిందని, ఈ వారంలో అగ్రి మెంట్ పూర్తి చేసుకుని మేలో పనులు చేపట్టనున్నామని తె లిపారు.
ఉస్మానియా ఆస్పత్రి హైకోర్టు బి ల్డింగులు చేపట్టి పూర్తి చేస్తు న్నామ న్నారు.బ్రాహ్మణ వెల్లేముల ద్వారా 40 వేల ఎకరాల కు సాగునీరు సా గునీరు అందిస్తున్నామని దేవరకొండ ని యోజకవర్గానికి తాగునీటి స మస్యను తీర్చేందుకు వారం పది రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా నీ రు అందించే కృషి చే స్తామని, అదే విధంగా నేరేడుగోమ్మ 33 కెవి సబ్ స్టేషన్ సమ స్యను పరిష్కరిస్తామన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ శాసనసభ్యు లు బాలునాయక్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతం గా ఒకే పాఠశాల లు అందరు చదివే విధంగా రాష్ట్ర ప్రభు త్వం యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లను నిర్మిస్తున్నదని అన్నారు. అన్నింటి కంటే విద్యాభివృద్ధి గొప్పదని , ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూ ర్తయితే యూనివర్సిటీ వాతావర ణం ఉంటుందని, 2563 మంది పిల్లలు ఒకే దగ్గర చదువుకోవచ్చ ని, దేవరకొండ , కొండమల్లే పల్లి ల ను సమానంగా అభివృద్ధి చేసి రెం డింటిని విలీనం చేయడమే తన ల క్ష్యమని, అందుకే కొత్తగా వచ్చిన ఆసుప త్రులు, ఇతర ప్రభుత్వ సం స్థలను దేవరకొండ కొండమల్లేప ల్లి మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్లో ఉన్న ఎంవి ఐ ఆఫీసును మంజూరు చేయాలని ,అలాగే 20 పడకల ఆసుపత్రి పూర్తిచేయాలని కోరారు .దేవరకొండ నియోజకవ ర్గం లో తాగునీటికి ఇబ్బంది ఉంద ని డిండి నుండి దేవరకొండకు నీరి చ్చే 90 కోట్ల రూపాయల ప్రతిపాద న ప్రభుత్వం వద్ద ఉందని, దీన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని, అలాగే దేవరకొండ జూనియర్ కళా శాల లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి జైపాల్ రెడ్డి పేరు పె ట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని అ న్నారు. ఇదివరకే ని యోజకవర్గంలో 5 కేజీ బి వి లు,ఐదు మోడల్ స్కూల్స్ తీ సుకురావడం జరిగిందని, కేజీబీలన్నింటికీ కాంపౌండ్ వాల్ తీసుకొచ్చామన్నారు.
పెళ్లి పాకాల రిజర్వాయర్ రీడిజై నింగ్ అంచనాలతో క్యాబి నెట్ అ నుమతిస్తే నియోజకవర్గంలో సా గునీటికి ఇబ్బంది లేదని, నక్కల గండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అను మ తులు క్లియర్ చేయిం చాలని, డిండి ప్రాజెక్టుకు గతంలో ఇ చ్చిన జీవో ప్రకారమే పనులు చే పట్టాలని, నియోజ కవ ర్గం లో హ్యం రోడ్ల ద్వారా 70 కోట్ల రూపాయల తో పనులు మం జూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని నేరేడు గోమ్మ లో132/11 కెవి సబ్ స్టేషన్ మంజూరు దశలో ఉన్నం దున తక్షణమే మంజూరు చేయించాలని, కొండపల్లిలో నిర్మి స్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశా ల భవనాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నా రు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవ ర్గానికి ఒ కటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ పాఠశాలల ను నిర్మించడం జరుగుతున్నదని, రెసిడె న్షియల్ విధానంలో 2563 మంది విద్యార్థులు ఒకేదగ్గర చ దువుకోవచ్చని, చదువుతోపాటు, వివిధ రకాల కార్యక్రమా లను కూడా ఈ పాఠశాలలో నేర్పించడం జరుగుతుందని, విద్యార్థిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఇది ఎంత గానో ఉపయోగపడుతుందని, ప్రత్యేకించి మారుమూల గిరి జన ప్రాంత విద్యార్థులకు కొండమల్లే పల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎంతగానో ఉపయోగప డుతుందన్నా రు. ఈ డబ్ల్యూ ఐ డి సి ఎస్ ఈ బాల ప్రసాద్, దేవరకొండ ఆ ర్డిఓ రమణారెడ్డి, డీఈవో, ఇ తర అధికారులు, ప్రజాప్రతిని ధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




