Tuesday, September 29, 2026
More
    HomeOpinionManjeera river tragedy : బిగ్ బ్రేకింగ్, పండుగ పూట తీరనివిషాదం, మంజీరానదిలో మునిగి...

    Manjeera river tragedy : బిగ్ బ్రేకింగ్, పండుగ పూట తీరనివిషాదం, మంజీరానదిలో మునిగి నలుగురు చిన్నారులు దుర్మరణం

    📰 Generate e-Paper Clip

    Manjeera river tragedy : ప్రజా దీవెన, బాన్సువాడ: ఆ ఇళ్ల ల్లో అప్పటివరకు నవ్వు లు, పండుగ సందడి కానీ మరికొద్దిసేపట్లోనే అక్కడ ఘోర కలి జరగబోతోందని ఆ అమాయక చిన్నారులకు తెలి య దు. పండుగ పూట సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ నలు గురు పిందెలు, మంజీరా నది గర్భంలో కలిసిపోయా రు. ఊహించ ని ఈ దారుణ ఘటన జిల్లాలోని పిట్లం మండ లం బొల్లాక్‌పల్లి సమీపం లో జరిగి అందరినీ కన్నీరు మున్నీ రు చేస్తోంది.ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

    శుక్రవారం బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ఎల్ల మ్మ వేడు క లను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక కుటుంబాలన్నీ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతా సజావుగానే సాగిం ది. వేడుకలు ముగిశాక, అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ తర్వాతే అసలు విషాదం మొదలైంది. సరదాగా ఆడుకుంటూ అనిత, పావని, శ్రీవాణి, భాను అనే నలుగురు చిన్నారులు సమీపంలోని మంజీరా నదిలో ఈత కొట్టేందు కు వెళ్లారు.

    నదిలోకి దిగిన కొద్దిసేపటికే.. అక్కడ పొంచి ఉన్న మృత్యు వు (ఊబి) వారిని లాగేసుకుంది. లోతుకు వెళ్లే కొద్దీ ఊబిలో చిక్కుకుపోయి పైకి రాలేక ఆ నలుగురు పసిప్రాణాలు గిల గిలా కొట్టుకున్నాయి. ప్రాణా ల కు తెగించిన మహిళ అయి నా ద క్కని ఫలితo పిల్లలు మునిగిపో తుండటం గమనించి న ఓ స్థానిక మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుం డా వారిని రక్షించేం దుకు నదిలోకి దూకింది. కానీ, ఆ మె కూడా ప్రమాదంలో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. గమ నించి న స్థానికులు వెంటనే స్పందించి ఆ మెను సురక్షితం గా బయటకు తీసుకురాగలిగారు.

    నలుగురు చిన్నారులు ఊబిలో ఇ రుక్కుపోయారన్న వార్త తెలియగా నే స్థానికులు నది వద్దకు పరుగు లు తీశారు. కానీ, అప్పటికే జరగ కూడని నష్టం జరిగిపోయింది. గ్రా మ స్థుల సహాయంతో నలుగురు చి న్నారుల మృతదేహాలను నది నుం చి బయటకు తీశారు. మరణించిన వారంతా పదే ళ్ల లోపు వయసున్న వారే కావడంతో అక్కడ ఉన్న ప్రతి ఒ క్కరి కళ్లు చెమర్చాయి.

    సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే బొల్లాక్‌పల్లికి చేరుకుని పరిస్థితి ని సమీక్షించారు. కేసు నమోదు చే సు కుని దర్యాప్తు ప్రారంభించారు.అప్పటివరకు తమ కళ్ల ముం దే నవ్వుతూ ఆడుకున్న బిడ్డ లు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రు లు, బంధువులు వేసిన కేకలు, రోదనలు మిన్నంటాయి. పం డుగ పూట ఆ ఇళ్లల్లో ప చ్చని నవ్వులు నింపాల్సిన రోజు.. గుండె పగిలే విషాదాన్ని మిగి ల్చిందని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.