Opinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇంజనీర్లు సూచనలివ్వాలి

--SLBC సొరంగం పూర్తయితే ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం

 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నె లకొన్న నేపథ్యంలో సాగునీరు, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవ సరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నా రు. ఖైరతాబాద్‌లోని విశ్వే శ్వరయ్య ఇంజనీర్స్ భవన్‌లో “ఎల్ నినో ఎఫెక్ట్ – సాగునీటి రంగం & వ్యవసాయం” అంశంపై నిర్వ హించిన కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నల్లగొండకు చెందిన ప్రముఖ ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి చిత్రపటానికి మం త్రి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. అ నంతరం గుర్రంకోటి రెడ్డి మెమోరియల్ అవార్డు గ్రహీతల ను సన్మానించి అవార్డులను అందజేశారు.

    ఇంజనీర్ల సూచనలు అవసరం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం తో వర్షాలు తగ్గి రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. కరువు పరిస్థితులను ఎ దుర్కొనేందుకు ప్రభు త్వానికి ఇంజనీర్లు విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ప్రభుత్వం తాగునీటికి అత్యధిక ప్రాధా న్యత ఇస్తుందని స్పష్టం చేశారు.“ఇంజనీర్లు లేనిదే దేశం లే దు. వ్యవసాయ రంగం లో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం” అ ని మంత్రి పేర్కొన్నారు.

ఎస్ఎల్ బిసితో ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం

నల్లగొండ జిల్లాకు అత్యంత కీల కమైన SLBC సొరంగం ప్రా జెక్టుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చే శారు. SLBC సొరంగాన్ని పూర్తి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇంజనీర్ల పాత్ర కీలకమని అన్నారు.“SLBC సొరంగ మార్గం పూర్తయితే నల్ల గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభి స్తుంది. గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగునీరు అం దిం చే అవకాశం ఉంటుంది. SL BC సొరంగం పూర్తయితే నా జ న్మ ధన్యమవుతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఈ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొరం గం పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

గుర్రం కోటిరెడ్డి, శ్యామ్ ప్రసాద్ సేవలస్మరణ

ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి తన ని యోజకవర్గంలోని తిప్పర్తి మండలానికి చెందినవారని మంత్రి గుర్తుచేశారు. తిప్పర్తికి వెళ్లిన ప్రతిసారీ కోటిరెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు.అదే వి ధంగా రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిజాయితీకి మా రుపేరుగా నిలిచారని కొనియాడారు. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీటిని చూస్తున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రె డ్డి గుర్తుకు వస్తారని మంత్రి పేర్కొన్నారు.తెలంగాణలో ప్రా జెక్టుల నిర్మాణంలో విశేష సేవలందించిన ఇంజనీర్లందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటున్నానని తెలిపారు.

    రూ.20 వేల కోట్లతో హామ్ రోడ్లు

రోడ్ల అభివృద్ధిపై కూడా మంత్రి కీ లక ప్రకటన చేశారు. తన ఆధ్వ ర్యంలోని ఆర్‌అండ్‌బీ శాఖ, మం త్రి సీతక్క ఆధ్వర్యం లోని పంచా యతీరాజ్ శాఖల ద్వారా తొలిదశలో సుమారు రూ.20 వేల కో ట్లతో HAM రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపా రు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడంతో పా టు.. గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండలం నుంచి జి ల్లా కేంద్రానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి సింగిల్ లేన్ రోడ్లను డబుల్ రోడ్లుగా, ఫోర్ లేన్ రోడ్లుగా అభి వృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు.

     అవార్డు గ్రహీతలకు సన్మానం

గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అ వార్డులను చంద్రమౌళి – రి టైర్డ్ చీఫ్ ఇంజనీర్,శ్రీపతి నరసింహ రెడ్డి – మాజీ అధ్య క్షు లు, జాతీ య భవనాల అసోసియేషన్ అందుకున్నారు. ఈ కార్య క్రమం లో చీఫ్ సైంటిస్ట్ మురళి, FIE చైర్మన్ ప్రొఫె సర్ రమణ నాయక్, కార్యదర్శులు వెంకటేశం, రమేష్ తది తరు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button