Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశం, సీఎం జిల్లా...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశం, సీఎం జిల్లా పర్యటన జయప్రదoకు పకడ్బందీ ఏర్పాట్లు

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యా ప్తంగా సుమారు రూ. 14,500 కో ట్ల వ్యయంతో నిర్మించనున్నహ్యాం రోడ్ల శంకుస్థాపన నిమిత్తం ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రే వంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వస్తున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రాకకు అవసరమైన అన్ని ఏ ర్పాట్లను పకడ్బందీగా చేయాలని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశిం చారు. గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నా యక్ తో కలిసి జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చం ద్ర పవర్, ఆర్ అండ్ బి అధికా రులు, సంబంధిత జిల్లా అధి కారులతో ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై సమావేశం నిర్వ హించారు.

    ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయ నున్న హ్యాం రోడ్ల పైలాన్, బహిరం గ సభ నిర్వహించే ప్రదేశం, బహిరంగ సభకు ఏర్పా ట్లు, ఇతర ఏ ర్పాట్లపై సమావేశంలో చర్చించారు. హ్యాం రో డ్లతోపాటు, మరి కొ న్ని అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ము ఖ్యమంత్రిచే ఇక్కడ నుం డే శంకుస్థాపనలు నిర్వహించే వి షయమై సమావేశంలో మంత్రి అధి కారులతో చర్చించారు. అలాగే రా ష్ట్ర ముఖ్యమంత్రితో ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చే యించి ధర్వేశిపురం రేణుక ఎల్ల మ్మ తల్లి దేవాలయాన్ని ఆధునిక రించేందుకు చర్యలు తీసుకుంటు న్నందున అవకాశం ఉంటే దేవాలయ ఆధునికరణ పనుల కు కూడా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమం త్రితో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు.

    శిలాఫలకం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. అనంతరం హ్యం రోడ్ల శంకు స్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే విధంగా ప్రాథమికంగా ఏర్పాట్లు చేసేలా మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సభను వి జయవంతం చేసేందుకు అ ధికా రులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. అంతే కాక సభకు హాజరయ్యే ప్రజల కోసం టెంట్లు, కుర్చీలు, తాగు నీరు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాల ని,ఏర్పాట్ల లో ఎక్కడ లోపం లేకుండా చూడాలన్నారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ జిల్లా ఎస్పీ శర త్చంద్ర పవర్ , జిల్లా అధికారులతో కలిసి గు రువారమే కన గల్ వెళ్లి రాష్ట్ర ము ఖ్యమంత్రి బహిరంగ సభకు,హ్యం రోడ్ల శంకుస్థాపనకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అలాగే పై లా న్ ఏర్పాటు చేసే స్థలం, బందోబస్తు తో సహా పరిశీలిం చి నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి,డిఈ గణేష్, జెడ్పిసిఈ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఇంజనీరిం గ్ అధికారులు, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమే ష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ స మావేశంలో ఉన్నారు

     లైనింగ్ పనులపై మంత్రి సంతృప్తి

    నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సు మారు 442 కోట్ల రూపా యలతో చేపట్టిన ఏఎమ్మార్పీ హై లెవెల్ కె నాల్ లైనింగ్ ప నులను జూలైలో పు సాధ్యమైనంత వరకు పూర్తి చే యాల ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఇ రిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ మండలo నర్సింగ్ బట్ల, కుదవన్ పూర్, గుండ్లపల్లి వద్ద ఏ ఎంఆర్పి హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనుల ను పరిశీలించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మం త్రి పనులను ఇంకా వేగవంతం చేయా లని, జూలై 31లోగా ఎంత ఎక్కు వ వీలైతే అంత ఎక్కువ పనులు పూర్తి చేసి ఎక్కువ నీరు సులభం గా కిందికి వెళ్లేలా చూడాలని అ న్నా రు. లైనింగ్ కోసం తాను ప్రత్యే కించి రాష్ట్ర ముఖ్యమంత్రితో మా ట్లాడి 442 కోట్ల రూపాయలను మంజూరు చేయించ డం జరిగింద ని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతు లకు మేలు కలిగే విధంగా ఈ వాన కాలం పంటకు ఎక్కువ నీరు కింది కి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు.

    కాగా ఏఎంఆర్పి కాల్వల లైనింగ్ అంగడిపేట నుండి మొద లుకొని మూసీ వరకు సుమారు 136 కిలో మీటర్ల వరకు చేపట్టడం జరుగుతు న్నది. 1985- 86 లో జరిగిన ఎం ఆర్పి కాలువ తవ్వకం పూర్తికాగా, 40 సంవత్సరాల తర్వాత రా ష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరె డ్డి చొరవతో లైనింగ్ పనులకు ని ధులు మం జూరు అయ్యాయి. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే రెం డు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీటిని సులభంగా అం దించ వచ్చుని, ప్రస్తుతం లైనింగ్ లేనందు వల్ల ఆయకట్టు చి వరి భూములకు నీరంధక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందేనన్నారు.

    లైనింగ్ పూర్తి అయితే కా లు వలో సులభంగా నీరు ప్రవహిం చి త్వరగా చివరి వరకు చేరుతుంది. అంతేకాక ఎక్కువ ఆ యకట్టుకు నీరు అందించే అవకాశం ఉంది. మంత్రి వెంట ఇరిగేషన్ సిఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఈ భద్రు,ఈఈ నెహ్రునా యక్, ఇతర ఇంజనీరింగ్ అధి కారులురైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే చివరి భూముల వరకు రైతాంగానికి సాగునీరు అందుతుందని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సీఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ బద్రు నాయక్, ఈఈ నెహ్రూ, డిఈ జితేందర్, ఏఈ గౌతమి,జేఈ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమే ష్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మో హన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మా జీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, గుండ్లపల్లి సర్పంచ్ వంగూ రి రమేష్, జానపాటి సతీష్ కుమార్, సూరారపు అనసూ య నగేష్, సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు జానపాటి రాజేంద్రప్రసాద్, రేగట్టే నాగరాజు, గంగుల సైదు లు, చింతల బిక్షపతి, చిమట శ్రీనాథ్, జకిర తాజుద్దీన్ ,మం గ దొడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.