Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నగర...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నగర సమ గ్రాభివృద్దే నా ప్రధాన లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: దేవాలయా ల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉం చి, ఆనందకరమైన వాతావరణా న్ని కల్పిస్తుందని రాష్ట్ర రో డ్డు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా రు. బుధవారo ఆయన నల్లగొండ పట్ట ణంలోని 41వ డివిజన్ పరిధి లోని పద్మావతి నగర్ కాలనీ పార్క్‌ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ ప ద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం ఎంతో శుభప రి ణామమని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భ క్తులు ఆ స్వామిని దర్శించుకునే సందర్భంలో స్థానికంగా ఆ లయం నిర్మించుకోవడం ఈ ప్రాంత ప్రజల కు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చే స్తుందన్నారు.పార్క్ అభివృద్ధి కోసం రూ.7 0 లక్షలతో పనులు ప్రారంభించామని, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయ ని తెలిపారు. ఇదే పా ర్కులో కాలనీవాసులు సుమారు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ దేవాలయానికి తన వంతు సహకారం అందిస్తానని మం త్రి హామీ ఇచ్చారు.

    నల్గొండ అభివృద్ధి తన ప్రధాన ల క్ష్యమని పేర్కొన్న మంత్రి, మేయర్ పట్టణంలోని ప్రతి వార్డులో తిరుగు తూ పచ్చదనం, చెట్ల పెంపకంపై అ వగాహన కల్పిస్తున్నారని ప్రశంసిం చారు. పట్టణంలోని అన్ని ప్రాంతా ల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఇలాంటి దేవాలయాల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉంచి, ఆనందకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని మం త్రి పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి , స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పి టిసి గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొ రేటర్లు వేణుగోపాల్ రెడ్డి, కవిత, ప ద్మావతి కాలనీ అధ్యక్షులు నేతి రఘుపతి, కార్యద ర్శి ఆంజనేయులు ఉపాధ్యక్షులు వెంకటర మణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.