Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కం చుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించి చారి త్రాత్మ క తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భ వనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వ చ్చిన తరువాతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవు తున్నాయన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో భాగంగా శనివారం 11, 6, 7, 8, 9, 10, 25 వార్డు లలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేష న్ లో రూ. 2,200 కోట్లతో వివిధ అభివృద్ధి పను లు వేగంగా ప్రగతి పథంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వ నిధులతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి చేస్తానని అడు గుతారు పేర్కొన్నారు. న ల్లగొండ లో ప్రభుత్వ నిధులతో పాటు తన కుమారుడు ప్రతి క్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపా యలు వెచ్చించి విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం జరి గిందని తెలిపారు.
రూ. 8.50కోట్లతో కోమటిరెడ్డి ప్రతీ క్ ప్రభుత్వ బొట్టుగూడ ఉన్నత పా ఠశాలను కార్పొరేటర్ స్థాయి పాఠశాలను మించి నిర్మించి అదే స్థాయి లో సౌకర్యాలు కల్పించడం జరిగిం దని అన్నారు. తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకో లేనిదని తెలిపారు. నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా చేయడమే తన ధ్యే యమని తెలిపారు.ఈ ఎన్నికలలో ఇ తర పార్టీల అభ్యర్థులను గెలిపి స్తే పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అ భివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశా రు. నల్గొండ ము న్సిపల్ కార్పొరే షన్ లోని 8వ వార్డును దత్తత తీ సుకొని అభివృద్ధి చేస్తానని ఈ సం దర్భంగా మంత్రి తెలిపారు. 11 వ డివిజన్లోని మామిళ్ళగూడెంలో 3 నెలల్లోనే సీసీ రోడ్డును పూర్తి చే యిస్తానని పేర్కొన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొ రేషన్ లో ప్లాట్ ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్లో మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏ సమస్య ఉన్న మీ కుటుంబ సభ్యు డిగా అం డ గా ఉంటానన్నారు.
ఈనెల 11న జరిగే మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు లను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ డా క్టర్ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రె డ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, సిపిఐ రాష్ట్ర నాయకు లు మల్లెపల్లి ఆదిరెడ్డి, కనగల్ మా జీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి,
11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొ రేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యో తి పరశురాం, 6 వ డివిజన్ అభ్య ర్థి కర్నాటి సు నంద కరుణాకర్ రెడ్డి,7వ డివిజన్ అభ్యర్థి అయితగోని రా ధాస్వామి, 8వ డివిజన్ అభ్యర్థి వజ్జ సంతోషిని రమేష్ యా దవ్, 9వ డివిజన్ అభ్యర్థి ఆంగోతు ప్రదీ ప్ నాయక్, 10వ డివిజన్ అభ్యర్థి చిన్నాల జానయ్య, 25వ డివిజన్ అభ్యర్థి జూలకంటి ధనలక్ష్మి శ్రీని వాస్, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య క ర్తలు పాల్గొన్నారు

