Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Uttam Kumar Reddy : ఉత్తమ్ అడ్డాలో రహదారులకు మహర్దశ, హుజూర్‌నగర్, కోదాడ 49...

    Minister Uttam Kumar Reddy : ఉత్తమ్ అడ్డాలో రహదారులకు మహర్దశ, హుజూర్‌నగర్, కోదాడ 49 కి.మీ డబుల్ దారికి గ్రీన్ సిగ్నల్ 

    📰 Generate e-Paper Clip

    Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైద రా బాద్: తెలంగా ణ పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు త్వరలోనే ప్రయాణం మరింత సులభం కానుంది. సుదీర్ఘ కాలంగా ఎన్నో సంవత్సరాలుగా సింగిల్ ర హదారులుగా ఉన్న మార్గాలు ఇక పై డబుల్ రోడ్లుగా మారబోతున్నా యి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంటూ సు మారు 49 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ. 130 కో ట్ల నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చే సింది.ఈ అభివృద్ధి వెనుక రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖ మం త్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ ఎ మ్మెల్యే పద్మావతి రె డ్డి కృషి ప్రధానంగా నిలిచింది. వారి ప ట్టుదలతో ఈ రెండు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఆధునిక రహదారి సదుపాయం అందబోతోంది.

      హుజూర్‌నగర్ నియోజకవర్గానికి పెద్ద ఊరట

    హుజూర్‌నగర్ పరిధిలో 26.50 కి లోమీటర్ల రహదారుల అ భివృద్ధికి రూ. 62 కోట్లు మంజూరయ్యాయి. దీని వల్లసు మారు 15 గ్రామాల ప్ర జలకు ప్రయాణం సులభం కానుంది. చింతలపాలెం, కిస్టాపురం 9.20 కి.మీ చింతలపాలెం, శోభ నాద్రి గూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిస్టాపురం గ్రా మాలకు లాభదాయకం కానుంది.

    అదే సందర్భంలో రామలక్ష్మిపురం హుజూర్‌నగర్ బైపాస్ కు సంబం ధించి 3.80 కి.మీ రామలక్ష్మిపురం, యర్రారం ప్రాంత ప్రజలకు సౌకర్యం అమరవరం కొత్త తండ 5.50 కి.మీ అమ రవరం, అంజలిపురం తండ, కొత్తతండ గ్రామాలకు ప్రయోజ నం చేకూరనుoది. ఇక గుడుగుంట్లపాలెం, ఎల్లాపురం 8 కి. మీ గుడు గుంట్లపాలెం, ముసిఒడ్డు సింగారం, ఎల్లాపురం ప్ర జలకు మెరుగైన రాకపోకలు రానున్నాయి.

       కోదాడ నియోజకవర్గానికికొత్త కనెక్టివిటీ

    కోదాడ పరిధిలో 22.60 కిలోమీ ట ర్ల రహదారులకు రూ. 6 8 కోట్లు మంజూరయ్యాయి. దీని వల్ల 9గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.కోదాడ అ నంత గిరి 6.60 కి. మీ 7 మీటర్ల ర హదారిని 10 మీటర్లకు విస్తరిం చ నున్నారు. దీంతో కోదాడ, ఖానాపురం, అనంతగిరి ప్రజ లకు ప్రయోజనకర ఫలాలు అందనున్నాయి.NH9 నేలమర్రి 10 కి. మీ తాడ్వా యి తండ, తాడ్వాయి, వెంకట్రాం పురం, నేలమర్రి గ్రామాలకు సౌల భ్యం కలగనుండగా కాపుగల్లు దో రకుంట 6కి.మీ కాపుగల్లు, దోరకుం ట గ్రామాల ప్రజలకు ప్ర యాణం సులువు కానుంది.

             త్వరలోనే పనులు ప్రారంభం

    ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే మంత్రిఉత్తమ్ కు మార్ రెడ్డి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ త్వ రగా టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారం భిం చాలని ఆదేశించారు. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రా జెక్ట్ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగం పె రగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందని,

    వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని, ప్రజలకు సురక్షి తమైన రవాణా సదుపాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అ యితే ఏది ఏమైనా మొత్తంగా చె ప్పాలం టే హుజూర్‌ నగర్, కోదాడ ప్రాంతాలకు ఇది అభివృద్ధి దిశ గా మరో పెద్ద అడుగు పడిందని, ఇది శుభ పరిణామం అని స్థానిక అధి కార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.