Sunday, September 27, 2026
More
    HomeIndiaMLA Komatireddy Rajagopal Reddy : మునుగోడుఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, 'గుడి'లో రాజ...

    MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడుఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, ‘గుడి’లో రాజ కీయం వద్దు, ‘బడి’లో సమస్యలుం డొద్దు

    📰 Generate e-Paper Clip

    MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు వేదికగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జ్‌గోపాల్ రెడ్డి మా ర్క్ పాలిటిక్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు విద్యార్థి నుల భవిష్య త్తుకు మాస్టర్ ప్లాన్ చే స్తున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా” భగ వంతుడి ముందు అందరూ సమాను లే అని వ్యాఖ్యానిస్తు న్న ఆయన మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చారి త్రా త్మక పురాతన శివరామ క్షేత్రాన్ని సంద ర్శించారు.

    ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు నిర్వహించిన అ నంతరం స్థానికుల తో ముచ్చటించారు. దైవ దర్శనంతోనే మనిషిలో సానుకూ ల దృక్పథం (Positive Attitude) అలవడుతుంది. మం చి గా ఆలోచిస్తే అంతా మంచే జరు గుతుంది, ప్రతిదానికీ నెగ టివ్‌గా ఆ లోచిస్తే ఇబ్బందులు తప్పవని వ్యా ఖ్యానించారు. “దైవ అనుగ్రహం లే నిదే ఏదీ జరగదు. గుడి మెట్లెక్కిన త ర్వాత అందరూ సమానులే. దయచేసి స్వార్థ ప్రయోజనాల కోసం గుడి వాతావరణాన్ని కలుషితం చేయకండి. ఆలయ వ్యవహారాల్లో రాజకీయాలు పక్కనబెట్టి, నిస్వార్ధంగా, పార దర్శకంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

    కస్తూర్బా స్కూల్‌కు ‘కార్పొరేట్’ లుక్

    24 గంటల్లోనే యాక్షన్ ప్లాన్ చెప్ప డం కాదు చేసి చూపించ డం రాజ్‌ గోపాల్ రెడ్డి శైలి మనందరికీ తెలిసిందే. నిన్న కస్తూ ర్బా పాఠశాల ప్ర హరీ గోడ శంకుస్థాపనకు వెళ్లిన ఆయన , అక్కడ విద్యార్థినుల వస తులను చూసి చలించిపోయారు. “మీకు అండగా నేనున్నా” అని ని న్న మాట ఇచ్చారు. కట్ చేస్తే, మంగళవారం ఉదయమే తన వ్య క్తిగత ఇంజనీర్‌తో కలిసి స్కూల్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే మర్రి గూడలో రూ. 2 కోట్లతో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దిన ఆయన, ఇప్పుడు ము ను గోడు కస్తూర్బా స్కూల్‌ను మోడల్ స్కూల్‌గా మార్చడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తు న్నారు.

    ఇదిలా ఉండగా తన తల్లి కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకా లు అందిస్తూ ఆ త్మవిశ్వాసాన్ని నింపుతున్న విషయం కూడా విదిత మే. మరోవైపు సొంతనిధులతో మౌలిక సదుపాయాలను మెరు గు పరుస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నారు. కస్తూ ర్బా స్కూల్ కు సంబంధించి 400 మంది విద్యార్థినుల అవ సరాలకు తగ్గట్టుగా తన వ్యక్తిగత ఇంజనీర్ నారాయణకు ఎమ్మెల్యే స్వయంగా దిశానిర్దేశం చేశారు. సదరు ప్రణాళిక లో భాగంగా తరగతి గదులు వేరుగా, హాస్ట ల్ గదులు వేరు గా ఉండేలా సరికొత్త డిజైన్ చేస్తున్నారు.

    ఇక వసతుల విషయానికి వచ్చే సరికి సరికొత్త టాయిలెట్లు, బాత్రూం లు, బట్టలు ఉతుక్కునేందుకు ప్ర త్యేక వాష్ ఏరి యా. ఆధునిక వంటగది, డైనింగ్ హాల్, వంట సామాగ్రి భ ద్రపరిచే స్టోర్ రూమ్. ఇలా స మూల మార్పులు సూచించా రు. వర్షపు నీరు నిలవకుండా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థ, వి ద్యార్థినుల సంఖ్యకు సరిపోయేలా పెద్ద సెప్టిక్ ట్యాంక్ నిర్మా ణం చేపట్టనున్నారు. విద్యార్థినుల ప్రతిభను వెలిగించే లా సాంస్కృతి క వేదిక (స్టేజ్), వి శాలమైన ఆట స్థలం ఏర్పాటు చే యనున్నారు. ఈ క్రమంలో త్వర లోనే మునుగోడు కస్తూ ర్బా పాఠ శాల సరికొత్త రూపంలో కార్పొరేట్ విద్యాసంస్థ ల కు సవాల్ విసిరేలా రూపుదిద్దు కోబోతోందని ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.