Mla Komatireddy rajgopalreddy ప్రజా దీవెన, పుల్లెం ల (చండూ రు): ఉదయాన్నే పల్లెలో కోడికూతతో పాటే ఆ యన అడుగులు పడ్డాయి. నాయకులు, అధికారుల దండ యాత్రలా కాకుండా.. ఒక సామాన్యుడిలా గల్లీగల్లీ తి రుగు తూ ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చండూరు మండలం పుల్లెం ల గ్రామంలో ఆయన చేపట్టినఈ ‘మార్నింగ్ వాక్’ కేవ లం నడవ డా నికే పరిమితం కాలేదు.. గ్రామాభి వృద్ధికి ఒక పక్కా రోడ్‌మ్యాప్‌లా మారింది.
రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి
ఇడికుడ నుంచి తెరటిపల్లి వరకు సాగుతున్న రోడ్డు వెడల్పు పను ల్లో భాగంగా పుల్లెంల పరిధిలోని ప్రదేశాలను స్వయం గా పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఏఏ ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా పోతున్నాయనే వివరాలపై అధికారుల నుంచి ఆ రా తీశారు. ప్రజలకు ఇ బ్బంది కలగకుండా పనులు జర గా లని స్పష్టం చేశారు.
నిర్మాణంలో ఉన్న భవనాలకు జీవం
గ్రామంలో అర్ధాంతరంగా నిలిచి పోయిన అంగన్వాడీ, ప్రాథ మిక ఉప ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచా యతీ, కమ్యూనిటీ హాల్ భవ నా లను పరిశీలించిన ఎమ్మెల్యే.. వాటిని త్వరిత గతిన పూర్తి చేసేందు కు అవసరమైన బడ్జెట్ అంచనాలు రూపొందించాలని తన వ్యక్తి గత సిబ్బందిని ఆదేశించారు. వి విధ గ్రామాలను కలిపే అనుసం ధాన రహదారులు, అం తర్గత రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధిపై గ్రామస్థులకు గట్టి హామీ ఇచ్చారు.
పేదల గుడిసెలకు ‘ఇందిరమ్మ’ ధైర్యం
గ్రామంలోని నిరుపేదల గుడిసెల వద్దకు వెళ్లి వారి జీవన పరిస్థితు లను కళ్లారా చూశారు. రాజగో పాల్ రెడ్డి. సాంకే తిక కారణాల వ ల్ల ఇందిరమ్మ ఇళ్లు అందని అర్హులైన నిరు పేదలను గుర్తించి వెంట నే జాబితా సిద్ధం చేయాలని గృ హనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే సమ యంలో నూతనంగా నిర్మించుకున్న ఒక ఇందిరమ్మ గృహాన్ని ఆయన పం డగలా ప్రారంభించారు.
బడి కోసం స్పాట్లోనే కమిషనర్‌తో ఫోన్ ఇన్
పుల్లెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మె ల్యే, విద్యార్థులు ఇరుకు గదుల్లో పడుతున్న ఇబ్బందులను గమనిం చారు. విశాలమైన మైదానంతో కూడిన నూతన భ వనానికి భూమి చూడాలని కోరగా.. గ్రామం లో 26 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని స్థానికులు తెలిపారు. ఆల స్యం చేయకుండా వెం టనే దేవాదాయ శాఖ కమిషనర్ హ నుమంతరావుతో ఫోన్లో మా ట్లాడారు. ప్రజోపయోగ భవ నాలు, బడుల నిర్మాణం కోసం ఆ భూములను కేటాయిం చాలని కోరారు.ప్రజా సమస్యలను నేరుగా తెలు సుకుం టూ, అధికారులకు ఎప్పటికప్పుడు సాగిన ఈ మార్నింగ్ వాక్‌లో మండల అధికారులు, స్థానిక నాయకు లు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొ న్నారు.


