Mla Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, నల్ల గొండ: తెలంగా ణ అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికపై అంతర్గత విభేదాల సెగలు మరో సారి తీవ్రస్థాయికి చేరాయ ని చెప్పవచ్చు. పార్టీని నమ్ముకున్న పాతతరం నేతలను ప క్కనపెట్టి, వలస నేతలకు పెద్దపీట వేస్తున్నారంటూ మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంధించిన రా జకీయ అస్త్రాలు గాంధీ భవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నా యి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మ హేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిధి దాటి మాట్లాడవద్దని హెచ్చరించారు. అయితే ఈహెచ్చరికలపై రా జగోపాల్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరింత దూకు డుగా స్పందించారు.తాను ఏ వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, పార్టీ శ్రేయస్సు కోసమే మాట్లాడా నని స్పష్టం చేశారు.తన వ్యాఖ్య లను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ న్‌ఛా ర్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కి తీసుకెళ్లినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.
కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్
గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పి దాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పు నరావృతం చేస్తోందని, అసెంబ్లీలో ఎంఐఎం, సీపీఐ మద్దతు పుష్క లంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చే ర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏముందని నిలదీశారు. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పు చ్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ చేరికలపై రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీ-ఫామ్‌లపై గెలిచి పార్టీలు మారే వారి తీరును, వారిని చేర్చు కుంటున్న నేతల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
గతంలో స్పీకర్ పదవిలో ఉంటూ కాంగ్రెస్‌ను బలహీనపరి చిన చరిత్ర పోచారానిదని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎవ రు ఆహ్వానించారని ప్రశ్నించారు. పార్టీలో చేరిన తర్వాత ఇబ్బందిగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇ ష్టం లేకపోతే పార్టీని వీడి వెళ్లిపో వచ్చని ఎద్దేవా చేశారు. ఇక ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ ఎంపీగా పో టీ చేస్తూ, ఇంకా పాత పార్టీలోనే ఉన్నానంటూ ద్వంద్వ వైఖ రి ప్రదర్శించడం రాజకీయ విలువలను దిగజార్చడమేనని దానం నాగేందర్ పై మండిపడ్డారు.
హైకమాండ్, ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నలు
పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తనకు హితబోధచేసే బదులు, వలస చేరికల వల్ల పార్టీకి జ రుగుతున్న నష్టాన్ని, భవిష్యత్ పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివ రించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ కారులు, ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తల త్యాగాలకు న్యాయం జ రగాలని, అవినీతిరహిత ప్రజాపాలన సాగాలన్నదే తన ఏకై క ఆకాంక్ష అని స్పష్టం చే స్తూ, తన వ్యాఖ్యలు పార్టీ బలోపే తానికే తప్పనష్టం కలిగించవని రాజగోపాల్ రెడ్డి తేల్చిచె ప్పారు.

