Most wanted Hardened criminal arrested : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు పోలీసు లు యువతను నేరగాళ్లుగా మార్చే ‘మాస్టర్ మైండ్’ ఆటక ట్టిం చి రూ. 53 లక్షల రికవరీతో పాటు 40 హైటెక్ దొంగత నాల గుట్టురట్టు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరా లు వెల్లడించారు. షాపులే వేదికగా యువతను ట్రాప్ చేసి, దొంగతనాల్లో ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్’ ఇచ్చిన కరుడుగ ట్టిన నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు సా మ్రా జ్యం బట్టబయలు చేశారు. మొత్తంగా 8 మంది టాప్ క్రి మి నల్స్ ఉన్న గ్యాంగ్ లో 6గురు అరెస్ట్ చేయగా ఇద్దరి కో సం వేట కొనసాగుతోంది.భారీ రికవరీ రెండు తెలుగు రా ష్ట్రాల్లో అలజడి సృష్టించిన 40 కేసుల ఛేదన. నిందితుల నుంచి 53 లక్షల విలువైన 26 0 గ్రాము ల బంగారం, 5 కేజీ ల వెం డి, రూ. 1.50 లక్షల నగ దు, హై-ఎండ్ హోమ్ థియేటర్ సిస్ట మ్స్, 5 బైక్ లు, 7 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జైలు పరిచయం నుండి ‘దొంగల సామ్రాజ్యం’ దాకా
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళా లు వేసిన ఇళ్లను టార్గె ట్ చేస్తూ, అధునాతన టెక్నాలజీకి సైతం దొరకకుండా తప్పిం చుకు తిరుగుతున్న ‘భూష్మి శ్రీకాంత్’ ముఠా గు ట్టును నల్గొం డ పోలీసులు ఛేదిం చారు.రాజమండ్రి సెం ట్రల్ జైలు లో 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తమ్మిశెట్టి నాగ రాజు (A-3) అనే పాత నేరస్థుడితో శ్రీకాంత్‌కు ఏ ర్పడి న పరిచయమే ఈ ము ఠా ఏర్పాటుకు బీజం వేసింది. జైలు నుండి బయటకు వ చ్చాక వీరిద్దరూ కలిసి ఒక సైకో-క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్మించారు.
వైన్ షాప్ ట్రాప్.. సిసిటివి ఎస్కే ప్ ట్రైనింగ్
విచారణలో తేలిన విషయాలు పోలీసులనే విస్మయానికి గు రి చేశాయి. శ్రీకాంత్ విజయవాడ, గుంటూరు, పల్నాడు పరి సరాల్లో తిరుగుతూ.. వైన్ షాపుల వద్ద అప్పుల్లో ఉన్న, జల్సాలకు అల వాటు పడిన యువకులను టార్గెట్ చేసే వా డు. ఉచితంగా మ ద్యం, డబ్బు ఇచ్చి నమ్మకం గెల వడం, “తక్కువ టైంలో కోటీశ్వరు లు అవ్వడం ఎలా?” అంటూ బ్రె యిన్ వాష్ చేయడం, తాళాలు ఎలా పగలగొట్టాలి? సీసీ టీవీ కె మెరాల బ్లైండ్ స్పాట్స్ (Blind Spots) ఎలా గుర్తిం చాలి? రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్‌ను ఎలా ముగ్గులో కి దించాలి? దొంగి లించిన సొత్తును ఎక్కడ మార్చా లి? అ నే అంశాలపై శ్రీకాంత్ స్వయంగా క్లాసులు తీసుకునేవాడు. ఇందులో నాగరాజు తప్ప మిగిలిన ఐదుగురు యువకుల కు ఎలాంటి పాత నేర చరిత్ర లేదని ఎస్పీ తెలిపారు.

ది గ్రేట్ ఛేజ్: పక్కా ప్లాన్.. డిజిటల్ దెబ్బ
శ్రీకాంత్ గ్యాంగ్ ఇచ్చిన సమాచా రంతో తెలంగాణలో 28, ఆంధ్రా లో 12 చొప్పున మొత్తం 40 మి స్టరీ కేసుల ముడి వీడింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో CCS ఇన్-స్పెక్టర్లు ఎం. జితేందర్ రెడ్డి, డి. చంద్రశేకర్ రెడ్డి, మిర్యా లగూ డ రూరల్ సీఐ PND ప్రసా ద్ బృందాలు రంగంలోకి దిగా యి.అధునాతన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ టెక్నాలజీ (12 క్రైమ్ సీ న్లలో వేలిముద్రలు మ్యాచ్ అ య్యాయి) మరియు డిజి టల్ సి గ్నల్స్ ఆధారంగా.. పిడుగురాళ్ల, అంజనీపురం, అ మరావతి పరిస రాల్లో ఈరోజు ఉదయం 9:00 గంటలకు మెరుపు దాడి చేసి ఆరుగురిని సైలెంట్‌గా లాగేశారు.అరెస్ట యిన కిలాడీలు (ఆరుగురు)కాగా పరారీలో ఉన్న ఇద్దరు కోసం వేట తీవ్రం చేశారు.
ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ నేరస్థుడు ఎంతటి హైటెక్ ప్లాన్ వేసినా, సైన్స్ అండ్ టెక్నా లజీ సాయంతో ప ట్టుకుంటాం. భవిష్యత్తులో జరగబోయే ఎన్నో పెద్ద నేరాలను ఈ ముఠా అరెస్టు తో ముందే అడ్డుకోగలిగాం. యు వత ఈ జీ మనీ వైపు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకో వద్ద నివి ఆయన హితవు పలికారు.ప్రాణాలకు తెగించి, అత్యం త చా కచక్యంగా ఈ అంతర్‌రాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను, సీసీఎస్ సిబ్బందిని హె చ్‌సీలు: వి ష్ణువర్ధనగిరి, పుష్ప గిరి, నాగరాజు, వహీద్ పాషా; పీసీలు: శివరాజ్, నరేష్, సాయి, నాగరాణి తదితరులను ఎస్పీ ప్ర త్యేకంగా అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా ప త్రాలు అందజేశారు.

