Sunday, September 27, 2026
More
    HomeOpinionMP Chamala Kiran Kumar Reddy : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉద్బోధ,...

    MP Chamala Kiran Kumar Reddy : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉద్బోధ, పోటీప్రపంచంలో గెలవా లం టే విద్యార్థులకు కంప్యూటర్ ప రిజ్ఞానం అవసరo 

    📰 Generate e-Paper Clip

    MP Chamala Kiran Kumar Reddy :  ప్రజా దీవెన, శా లిగౌరారం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొ నేం దుకు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రె డ్డి అన్నారు. మంగ ళవారం అయన తుంగతుర్తి శాసనస భ్యులు మందుల సామెల్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ లతో కలిసి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవుని బండ, పేర్క కొంoడారం గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

    ముందుగా పేర్కకొండారం గ్రామం లో పార్లమెంట్ సభ్యులు, జిల్లా క లెక్టర్లు 10 లక్షల రూపాయల వ్య యంతో నిర్మించిన సిసి రోడ్డును , 7 లక్షల రూపాయల వ్యయంతో ని ర్మించిన ఎస్ సి కమ్యూనిటీ హాల్ ను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో 4 లక్షల రూపాయల వ్యయం తో ఆధునికరించిన కం ప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనం తరం జిల్లా పరి షత్తు హైస్కూల్ ఆ వరణలో ఏర్పాటు చేసిన సమా వే శం లో పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అమ లు చే స్తున్న పథకాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవా లని కోరారు. విద్యార్థులు పోటీని తట్టుకొని నిల బడేందుకు కంప్యూటర్ పరిజ్ఞానా న్ని సంపాదించాలని, విద్యార్థులకు తలెత్తే సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా అలాగే గూ గుల్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, అందుకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

     

    గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్ర జలకు అవసరమైన ప నులను చేసేందుకు కృషి చేయాలని, ప్రజా సంక్షేమ కార్యక్ర మాలు పేదవారికి అందేలా చూడాలని కోరారు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథ కాలు జోడెడ్లలాంటివని, వాటి ఫలితాలు నిరుపేదలకు అందిన ప్పుడే అవి సద్వినియోగం అవుతాయని అన్నారు. ప్రజాపా లన- ప్ర గతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా వివిధ అభివృద్ధి ,సంక్షేమ పథకాలను అమలు చేయడం జ రుగుతున్నదని, వాటన్ని టిని ఉపయోగించుకోవాలని కోరా రు. బాలవికాస్ ఆధ్వర్యంలో పాఠ శాల విద్యార్థులకు కం ప్యూటర్లు అందించడం అభినందినీయమని అన్నారు.

    రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్నందు న, వి ద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మరింత పెంపొం దించుకోవాలని, ప్రపంచాన్ని జయించే విధంగా ప్రపంచం వై పు అడుగులు వేయా లని కోరారు. స్థానిక సంస్థల ఇంచా ర్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్ డిఓ వై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈ ఈ గిరి ధర్ ,సర్పంచ్ నాగ లక్ష్మి ఎంఈఓ, మార్కెట్ కమిటీ చైర్మన్, తహసిల్దార్, ఎంపీడీ వో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

     

    ప్రభుత్వపథకాలు అట్టడుగువర్గాలకు చేరా ల్సిన అవసరముంది

    ప్రభుత్వ పథకాలు అట్టడుగు వ ర్గాల ప్రజలకు చేరాల్సిన అ వసరం ఉందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మంగళవారం అయన తుంగ తుర్తి శాసనసభ్యులు మం దుల సామేలు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్లతో కలిసి నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం, బైరవుని బండలో భైరవుని బండ నుండి నక్కలపల్లి వరకు 8 కోట్ల రూపాయ లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థా పన చేశారు.10 లక్షల రూ పాయల వ్యయంతో నిర్మించను న్న గ్రామ సంఘ బంధ భవన నిర్మాణా నికి శంకుస్థాపన చే యగా, 10 లక్ష ల రూపాయల వ్యయంతో నిర్మిం చిన సిసి రోడ్డును ప్రారంభించారు.

    అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చామల కి రణ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్ర జ ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ద ని, ప్రత్యేకించి గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని, ఈ ఇండ్లు పేద వర్గాలకు అందాల్సిన అవసరం ఉందని అన్నారు .ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా అమలు చేస్తు న్న పనులను సద్వినియోగం చేసు కోవాలని కోరారు. స్థానిక నాయ కు లు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలు కింది స్థాయికి వెళ్లినప్పుడే అర్ధ మంతమ వుతాయని అన్నారు. ముఖ్యమైన పనులకు మాత్రమే నిధు లు వెచ్చించి పూర్తిచేసుకో వా ల్సిన అవసరం ఉందని, ప్రతి గ్రా మంలో ప్రాధాన్యత క్రమంలో ప నులు చేపట్టేందుకు చ ర్యలు తీసుకుంటామని తెలిపారు. శాలిగౌరారం మండలం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మండలాభివృద్ధికి సహకరిం చాలని ఆయన జిల్లా కలెక్టర్ తో కోరారు.

     

    తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడు తూ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన- ప్రణా ళి క 99 రోజుల రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివి ధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, అందులో భాగంగా భైరవుని బండలో పలు కార్యక్రమాలకు ప్రారం భో త్సవాలు, శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గ్రామాలలో అ భివృద్ధి కార్యక్రమా లు జరిగినప్పుడే గ్రామం అభివృద్ధి అవు తుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.

     

    ఇడుపులపాడు, జూల వారి గూడెం ,శాలిగౌరవరం నుండి వంగమ ర్తి వరకు పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణా లను పూర్తిచేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధి కారులతో కోరారు. అలాగే ని యోజకవర్గంలో చిన్నచిన్న డొంక రోడ్లు ఉన్నాయని వర్షాకాలంలో ప్ర జలకు ఇబ్బందిగా ఉన్నాయని, అందువల్ల డిఎంఎఫ్ టి కింద ఈ రోడ్లను మం జూరు చేయాలని జి ల్లా కలెక్టర్ తో కోరారు. రాష్ట్ర ప్ర భు త్వం రైతులకు ఇస్తున్న వ్యవ సాయ పనిముట్ల గురించి వ్య వసా య అధికారులు రైతులకు తెలియ జేయాలని, ప్ర భుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపా య ల బోనస్ ఇస్తున్నదని, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం, హా స్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మో టిక్ చార్జీల పెం పు, అర్హులకు ఇంది రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నదన్నా రు. రెండో విడత కూడా అర్హులైన వారికి ఇద్దరమ్మ ఇండ్లు వ స్తాయని, ప్రజలు వారి పిల్లలని బాగా చదివించుకోవాలని కో రారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్ర ణాళికలో భాగంగా ప్రభుత్వం అనే క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నద ని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ లతోపా టు, రైతు భరోసా ,రైతుల సంక్షేమం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న దని అన్నారు. ఈ నెల 6 నుండి 1 1 వరకు ఆరో గ్య వారోత్సవం కింద ఆరోగ్య కార్యక్రమాలను నిర్వ హిం చ డం జరుగుతున్నదని జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్యఆరో గ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రధానాస్పత్రిలో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అక్కడ వైద్య చికిత్సలు పొందాలని కోరారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశో క్ రెడ్డి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ గిరిధ ర్, మండల అధికారు లు, స్థానిక ప్ర జాప్రతినిధులు, సర్పం చ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

     

    రబీధాన్యం కొనుగోళ్ళలో రైతులను ఇబ్బం దులు పెడితే కఠిన చర్యలు

    రబీ ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎవరైనా రైతులకు ఇ బ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆ య న నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో భువనగిరి పా ర్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పిఎసిఎస్ ఆ ధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా రు.అంతేకాక శాలిగౌరారం మండలం బైరవుని బండలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సా మెల్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగో లుకుగాను 408 ధాన్యం కొనుగో లు కేంద్రాల లక్ష్యంగా రైతులు పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చే స్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర భు త్వం రబీలో రైతులు పండించి న గ్రేడ్ “ఏ” ధాన్యానికి క్విం టాలు కు 2389/ రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ కు 2369 /- రూపాయల మద్దతు ధర చెల్లించి ధా న్యాన్ని కొనుగోలు చేస్తు న్నదని తెలిపారు.

     

    ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేశామ ని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ సవ్యంగా జరిగేందుకు గాను తనతోపాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ క లెక్టర్, ఆర్డీవోలు, సంబంధిత త హసి ల్దార్లు, పౌరసరఫరాల అధికా రులు నిరంతరం ధాన్యం సే కరణను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. రబీ దాన్యం సేక రణకు సంబంధించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు లేదా ధాన్యం దిగుమతి చేసు కునే విషయంలో మిల్లర్లు రైతుల ను ఇబ్బందులు పెడితే కఠిన చ ర్య లు తీసుకుంటామని ఆయన హె చ్చరించారు. ధాన్యం సేకరణ పై సో షల్ మీడి యాలో వచ్చే పుకార్లు, వదంతులను నమ్మవద్దని ఆయన కో రారు.

     

    రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యమై న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావా లని, ధాన్యంలో తేమ లేకుండా, తాలు,తరుగు ఉండకుండా ధాన్యాన్ని తూర్పారబట్టి తీసుకురావాలని కోరారు. అన్ని కొ నుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పా టు చేశామని, టార్పాలిన్లు, తూర్పారబట్టే యంత్రాలు, తేమ కొలిచే యంత్రా లు ఉన్నాయని, వాటిని సద్విని యోగం చే సుకోవాలని ఆయన వి జ్ఞప్తి చేశారు. ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశాలను బట్టి ఆయా ప్రాంతాలలో ధాన్యం కొను గోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగు తున్నదని ఆయన తెలిపారు. కొ నుగోలు కేంద్రాలు లేదా మిల్లర్ల వద్ద రైతు లకు ఇబ్బందులు కలిగితే జి ల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ ర్పా టు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9963407064 కు ఫోన్ చేసి తె లియజేయాలని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, డిఆర్ డిఓ శేఖర్ రె డ్డి, మండల అధికారులు, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.