Municipal Election Campaign : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారా నికి సోమవారం 5గంటలతో తెరపడింది. గల్లీగల్లీల్లో మా రుమోగిన మైకులకు తెలంగాణ రా ష్ట్ర ఎన్నికల సంఘం తాళం వేసింది. దీంతోతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్ర చారానికి ఎన్నికల సం ఘం విధించిన గడువు కొద్ది సేపటికి ముందే ముగిసింది. ఈరోజు సా యంత్రం 5 గంటలతో ఎన్ని కల ప్రచారంకు ముగింపు పలికడంతో ఎన్నికల సంఘం వి ధించిన పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్దకాలం అమ ల్లోకి వచ్చింది.
ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల ప రిధిలో అన్ని రకాల ప్ర చా రాలపై ని షేధం అమలులోకి రావడంతో ర్యా లీలు, సభలు, ఊరేగింపులకు అ నుమతి లేదని, టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం ని షేధం అమలులోకి రావడం, సోష ల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచా రాలపై కూడా ఆంక్షలు ఆ రంభమయ్యాయి. నిబంధనలు ఉల్లం ఘిస్తే 2 సంవత్సరాల జైలు లేదా జరి మానా విధిస్తామం టూ ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తోంది.
మూగబోయిన మైకులతో నిశ్శ బ్దంలోకి మున్సిపాలి టీలు…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగి యనుంది. సోమవారం సాయంత్రం 5 గంటకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీ లు, 7 నగరపాలక సంస్థల కు పో లింగ్ జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీల శ్రేణు లు, అగ్రనేతలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచా రం కొనసాగించారు.
ఈ ప్రచార కార్యక్రమం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరో పణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హో రెత్తిoది. సో మవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగి యడoతో మైకులు మూగబోయాయి. అగ్రనేతలతో పాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అంతా ఇంటికి తిరు గు పయనమయ్యారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఆఖ రి రోజు ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు, స్థానిక నేతలు ప్రజలను తమ వై పునకు తిప్పుకునేందుకు తమ వంతు వి శ్వప్రయత్నాలు కొనసాగించారు.
అదే విధంగా ఈ నెల 11వ తేదీ ఎ న్నికల పోలింగ్‌కు సం బంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షి స్తోంది. కాగా హోరా హో రీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం వెలువడనున్నా యి.

