Nalgonda collecter Chandrashekar Badugu : ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండ లంలో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రభు త్వ సంస్థల తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు కూడా చేశా రు. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పా టు, తాగు నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జి ల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి కారి ని ఆదేశించారు.వన మహోత్సవం కింద రానున్న వర్షాకా లంలో మొక్కలు నాటేందుకుగాను అన్ని గ్రామాలలో మొ క్కలు నాటే స్థలాల ను గుర్తించాలని, నర్సరీలలో పెం చుతు న్న మొక్కల గురించి గ్రామ సభలలో ప్రజలకు తెలియజేసి వా రి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బుధ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల, అడ్లూరు గ్రామా లలో పర్యటించి పలు ప్రభుత్వ సం స్థలను,ప్రభుత్వ పనులను తనిఖీ చేశారు.
ముందుగా వల్లాల గ్రామంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వ ర్యంలో పెంచుతున్న వనమహోత్సవం నర్సరీని తనిఖీ చేశా రు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు,వాటి రకాలు, గ్రామ పంచాయతీ ద్వారా వాన కాలంలో నాటనున్న మొక్కల టా ర్గెట్, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, గృహాలకు పంపిణీ చే సే మొక్కలు, జియోట్యాగింగ్ తదితర వివరాలన్నింటిని ఏ పీఎం శంకరయ్య ,ఏపీవో జంగమ్మ, వన సేవకుడు తంబ య్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో పెంచుతు న్న మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ సంరక్షించాలని, నర్సరీ లో పెంచుతున్న మొక్కల విషయాలను గ్రామసభలో గ్రామస్తులకు చదివి వినిపించి వారి అభిప్రాయం సేకరించి గ్రామానికి అవసరమైన మొ క్కలను పెంచేందుకు ప్రణాళిక రూ పొందించాలని, వానకాలంలో నాటనున్న మొక్కలకు ముందే స్థలా లను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని, గ్రా మానికి నిర్దేశించిన 13 800 మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చే సి గ్రామస్తుల ఉదయం నడకకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వల్లాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఫిష్ పాండ్ త వ్వుతుండగా తనిఖీ చేశారు. కాగా ఉపాధి హామీ పథకం కింద 6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 3000 పని దినాలు కల్పించేందుకు ఫిష్ పాండ్ పనులు చేపట్టగా, కూ లీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతమంది వస్తున్నార ని? పని ఎప్పుడు ప్రారంభించారని? మెజర్మెంట్ ఎంత తీసు కున్నారని? అడిగారు. ఎండలకు పనిచేయలేకపోతు న్నా మని కూలీలు జిల్లా కలెక్టర్ కు తెలుపగా ఉదయం వచ్చి ప ని చేసుకోవాలని, తక్కువ పని చేస్తే తక్కువ వేతనం వస్తుం దని, అలా కాకుండా ఎక్కువ పనులు చేసుకున్నప్పుడు ఎ క్కువ వేతనం వచ్చేలా చూడాలని ఫిష్ పాండ్ తో పాటు, ఫీ డర్ ఛానల్ ,ఇతర పనులు చేసుకోవాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మస్టర్, ఇతర రిజిస్టర్లను పరిశీ లించారు .ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడ తోపాటు, తాగు నీటిని కల్పించాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఆ తర్వాత జి ల్లా కలెక్టర్ గ్రామంలో కట్టగూరు సుధారాణి అనే లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి ని పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయ తీని సంద ర్శించి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించనున్న గ్రామ సభకు సంబంధించి సర్పంచి తిరుప తమ్మ, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చిం చారు.
గ్రామసభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గ్రామ అధికారు లు అందరికీ తెలియజేయాలని, అ దేవిధంగా స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందర్నీ గ్రామస భకు ఆహ్వానించాలని, మినిట్స్ రి కార్డు చేయాలని, గ్రామ సభలో ఏ మైనా గ్రామ సమస్యలు ఉన్నట్ల యితే చర్చించాలని తెలి పారు. కాగా గ్రామానికి సంబంధించి పాఠశాల సమస్యను, విద్యుత్ సమస్యను , పాత బిల్లుల విషయాన్ని సర్పంచ్ జి ల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించి యోగ తరగతి గదిని తనిఖీ చేశారు.
పాఠశాలలోని తాగునీటి ఆరో ప్లాం ట్ పనిచేయడం లేదని తెలుసుకొ ని తక్షణమే మరమ్మతులు చేయించాలని, పిఎం సి బోర్డు ఏర్పాటు చే యాలని, డ్యూయల్ డేస్కులను తక్ష ణమే ఫిట్ చేయించాలని ప్రిన్సి పల్ కృష్ణమోహన్ ను ఆదే శించారు. అనంతరం వంటగదిని, డైనిం గ్ ను పరిశీలించి కట్టెలపై వంట వండుతుండడాన్ని గమనించిన జి ల్లా కలెక్టర్ తక్షణమే కట్టెల ద్వారా వండడాన్ని నిలిపివేసి గ్యాస్ పై వం డాలని వంట మనుషులను, పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదే శించారు. తెలంగాణ మోడల్ స్కూల్ పి ఎం శ్రీ కింద చేపట్టి నందున మోడ ల్ స్కూల్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉం దని కలెక్టర్ ఆదేశించారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మం డలంలోని అడ్లూరు గ్రా మంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీ లు, బాలింతలు, శామ్,మామ్ పిల్లల వివ రాలను అడిగి తెలుసుకు న్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రై వేటు భవనంలో నిర్మిస్తుండగా ప్రభు త్వము ఎన్ఆర్ఈ జీఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రం మంజూరు చేసిందని తె లుసుకొని తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేయాల ని ఆదేశించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ అంగ న్వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం వివరా లను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యానికి జాగ్రత్తగా చూ సుకోవాలని చెప్పారు.
కేంద్రంలోని స్టాక్ రిజిస్టర్ లను, గు డ్లు, బియ్యం, ఆయిల్ త దితర వంట సరుకులను తనిఖీ చేశారు. అనంతరం ఇదే గ్రామంలో నిర్మాణం లో ఉన్న గ్రామ సమాఖ్య భవనాలను తనిఖీ చేశారు. గతంలో గ్రామా నికి 50 డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు కాగా, 25 మాత్రమే పూర్తయ్యాయని, తక్కి నవి ఆగిపోవడాన్ని సర్పంచ్ లక్ష్మి ,వెంకట్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే మిషన్ భగీరథ నీరు స గం గ్రామానికి వస్తున్నదని, సమ స్యను పరిష్కరించాలని కోరారు.గ్రామ సమాఖ్య భవ నానికి ఎస్ బి ఎంలో టాయిలెట్లు మంజూరు చే యాలని డిఆర్డిఓ ను కలెక్టర్ ఆదే శించారు. ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ వరప్రసాద్, వల్లా ల పంచాయతీ కార్యదర్శి కృష్ణ య్య, ఎంఈఓ సైదులు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉ న్నారు.




