Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక వ్యాఖ్య,ఏళ్ల తరబడి పెండింగ్...

    Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక వ్యాఖ్య,ఏళ్ల తరబడి పెండింగ్ భూసమస్యల ప రిష్కారానికి శాశ్వత పరిష్కారం

    📰 Generate e-Paper Clip

    –పదేళ్ళలో మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను సందర్శించి న న కలెక్టర్

    –చందంపేట మండలం, పొగిళ్ల, కం బాలపల్లి భూ సమస్యల పరిష్కా రానికి తక్షణ చర్యలు

    –ఏప్రిల్ 15 నుండి పొగిళ్ల భూము ల సర్వేకు ప్రత్యేకసర్వేబృందాల ఏ ర్పాటుకు నిర్ణయం

    Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ల ,కం బాలపల్లిలలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్య ల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసు కుంటామని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగ ళవారం ఆయన దేవర కొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అ ధికారులతో కలిసి పొగిళ్ల, కంబా లపల్లి గ్రామాలను సంద ర్శించారు.ముందుగా గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇం డ్లు, గ్రామ సమస్య లను గ్రామస్తుల ద్వారా అడిగి తె లు సుకున్నారు. ప్రాథమిక పాఠ శాలను తనిఖీ చేసి విద్యార్థుల తో మాట్లాడారు.

    వంటగదిని పాఠశాలలో సౌకర్యా లు ,మధ్యాహ్న భోజనం, తదితర వివరాలను పరిశీలించడమే కాకుండా తనిఖీ చేశా రు. అసంపూర్తి గా ఉన్న పాఠశాల తరగతిగదితో పాటు, తాగునీరు,కిచెన్ ఇతర ప నులన్నింటిని అమ్మ ఆదర్శ పాఠ శాల కమిటీతో తీర్మానం చేయించి అంచనాలు పంపించి ప నులు చేప ట్టి పూర్తి చేయించాలని జిల్లా విద్యాశాఖ అధి కారిని ఆదేశించారు.

    ఎలా చదువుతున్నారని విద్యార్థులను ప్రశ్నించడమే కాకుం డా, యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి విద్యార్థులతో తెలు గు శతకాలు ప ద్యాలు చదివించారు. విద్యార్థులు మధ్యలో బడిమాని వేయకుండా చూడాలని, ఉపాధ్యాయులు రె గ్యు లర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అ ధికారిని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో గ్రామస్థులతో మాట్లాడారు.

    గ్రామంలో ఉన్న భూసమస్యల విష యాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ పొగిళ్ల గ్రామంలో సర్వే నెంబర్ 2లో సుమారు 1056 ఎక రాలు ఉందని, గతంలో డిఫామ్ ప ట్టాలు ఇవ్వడం జరిగింద ని, 2023 లో ఎల్ ఆర్ యు పి అమలు సందర్భంగా కొంత మంది రైతుల భూములకు పట్టాలు రాలేదని, కొంత మంది రైతులకు ఎక్కువ భూమి రి కార్డు కావడం, కొంతమందికి రి కార్డు కాకపోవడం జరిగాయని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కురాగా, కంబాలపల్లి లో ఇదే విష యమైమో కా సర్వే నిర్వహించడం జరుగుతున్నదని, అక్కడ సర్వే పూ ర్తయిన తర్వాత ఏప్రిల్ 15 నుండి పొగిళ్లలో భూముల సర్వే తో పాటు, మోక సర్వే నిర్వహించ డం జరుగుతుందని కలె క్టర్ స్పష్టం చేశారు.

    రైతులు సర్వేకు సహకరించాలని, ప్రస్తుతం ఉన్న పట్టాలు, రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి, మోకాపై ఉన్న రైతు ల జాబితాను గ్రా మం పంచాయతీ నోటీస్ బోర్డులో ప్రదర్శిం చి అభ్యంతరాలు స్వీకరిం చిన అనంతరం, వాటిని పరిష్క రించి, పూర్తి విచారణ నిర్వహించిభూ భారతి ద్వారా అర్హు లైన రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకో గా కంబాలపల్లి నుండి పొగిళ్ల వరకు ఆర్ అండ్ బి రహదారి మరమ్మతులు చేయించాలని ,సబ్ స్టేషన్ మం జూరు అ యిందని వెంటనే పనులు మొదలుపెట్టాలని, గ్రామ సమా ఖ్య భవనం మంజూరు కాగా, వివాదాల కారణంగా నిలిచి పోయిందని, అలాగే పట్టాలతో పాటు, ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమ స్యను పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

    గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను ప్రభు త్వం అమలు చేసే పథకాలకు దర ఖాస్తు చేసు కోవాలని, సెరికల్చర్ టెంట్ హౌస్, కిరాణా తదితర చి న్న చిన్న వ్యాపారులు నిర్వహించు కునేందుకు ప్రభుత్వము బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తుంద ని, అంతేకాక శిక్షణ ఇస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్ట ర్ కోరారు. తక్షణమే గ్రామ స మాఖ్య భవన నిర్మాణాన్ని చే పట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదే శించారు.

    ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చే సి విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరి శీలించారు. పిల్ల లతో అంగన్వాడి కేంద్రం ద్వారా ఇ స్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి టీ చర్ తో విద్యార్థులకు బోధించే క థలు, ఆట,పాటలు, అన్నింటిని అ డగడమే కాకుండా పిల్లలకు పెట్టే భోజనాన్ని పరిశీలించారు. అంగ న్వాడి కేంద్రానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నందు న తక్షణమే ఫ్యాను, లైట్లు ఏర్పా టు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించా రు. ఆ తర్వాత పల్లె దవఖానాను సందర్శించి ప్రజలకు అం దిస్తున్న వైద్య సౌకర్యాల పై ఆరా తీశారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ రెగ్యులర్గా పల్లె దవఖానను సందర్శించాలని ఆదే శించారు. ప్ర స్తుతం నర్సు వైద్య సేవలు అందిస్తున్నదని, రో గం తీవ్రతను బట్టి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం, లేదా ఆస్ప త్రికి పంపించాలని ఆదేశిం చా రు. గ్రామంలో పరిశుభ్ర త ఉండేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్ జటావత్ జయేం దర్ ను, కార్యదర్శి రవి ని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశిం చారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం కంబాలపల్లి సర్పం చ్ గోవిందు నివసిస్తున్న రేకుల వలయం తండాను సంద ర్శించి అక్కడ పాఠ శాలలో ఉపాధ్యాయుడు రావడం లేదని తెలుసుకొని తక్షణమే ఉపా ధ్యాయుడిని ఏర్పాటు చేయాల ని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదే శించారు. అనంతరం కంబాలపల్లి రైతు వేదికలో రైతులు, గ్రామస్తుల తో మాట్లా డుతూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరగా సర్వేనెంబర్ 50, 37, ఉన్న భూ సమస్యలను పరి ష్కరించాలని, గడచిన పది సంవత్సరాల నుండి తమ భూ ములకు పట్టాలు లేవని, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చా రు. గు వ్వలకుంట లో టీచర్ ను ని యమించాలని, తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

    ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూములు సాగు చేసు కుం టున్న రైతులకు పట్టాపాస్ బు క్కు లు జారీ చేసేందుకు కంబాలపల్లి లో సర్వే నంబర్ 50లో మోకా సర్వే పూర్తి చే యడం జరిగిందని మంగళవారం నుండి 37 సర్వేనెం బర్ లో ప్రారంభిస్తున్నామని, ఇం దుకు రైతులు పూర్తిగా సహ కరించాలని, అనంతరం ఒకటి నుండి 49 సర్వే నంబర్లలో ఉన్న సమస్య లను సైతం పరిష్కరిస్తామని, ఉన్న భూమి కన్నా ఎక్కువ రికార్డు అ యినందున సమస్యలు వచ్చాయ ని, సర్వే పూర్తయిన తర్వాత మో కాపై ఉన్న వారి వివరా లన్ని ఆధా రం చేసుకుని భూభారతి ద్వారా పట్టాలిస్తామని తెలిపారు. ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను తీర్చేందుకు ఇందిర జల ప్రభ కింద బోర్లు, సో లార్ విద్యుత్ వంటివి ఏర్పాటు చే స్తామని కలెక్టర్ తెలిపా రు. గ్రామం లో నెలకొన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సం బంధించి జాయిం ట్ సర్వే నిర్వహించాలని తహసి ల్దార్ శ్రీధర్ బాబును ఆదేశించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్క నే ఉన్న ప్రాథమిక పాఠ శాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అసంపూర్తి గా ఉన్న తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, తాగునీరు కిచెన్ షెడ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మీ టింగ్ లో తీర్మానం చేసి అంచనా లు రూపొందించి పంపించాలని ని ధులు విడుదల చేస్తామని చెప్పా రు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్ డిఓ రమణారెడ్డి, జిల్లా అధి కారులు డిపిఓ శంకర్ నాయక్, డి ఈఓ బిక్షపతి, జిల్లా సంక్షేమ అధి కారి కృష్ణవేణి, ఆర్డ బ్ల్యూఎస్ ట్రా న్స్కో, మైనింగ్ తదితర శాఖ అధి కారులు ,చందంపేట తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, తదితర అ ధి కారులతో పాటు ,పొగిళ్ల, కంబాల పల్లి సర్పంచులు తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.