Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్,రాష్ట్ర ప్రభుత్వం హు కుం, రంగంలోకి దిగిన జిల్లా...

    Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్,రాష్ట్ర ప్రభుత్వం హు కుం, రంగంలోకి దిగిన జిల్లా యం త్రాంగం

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, మిర్యాలగూడ: జిల్లా లోని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని దించుకునేం దుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. అలా కాదని ప్రైవేటు ధాన్యం దించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరిం చారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మి ల్లుల వద్ద లారీ ల అన్లోడింగ్ జా ప్యం జరుగుతున్నదని వార్తలు వచ్చిన నేప థ్యంలో మంగళవారం అ యన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి రైస్ మిల్, మహే శ్వరి పారా బాయిల్డ్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చే శారు. ముందుగా వాగ్దేవి రైస్ మిల్లును ఆయన తనిఖీ చేసి మిల్లుకు వచ్చిన ప్రభుత్వ, ప్రై వేటు ధాన్యాన్ని పరిశీలించా రు.

    మిల్లు యజమానితో మాట్లాడు తూ ప్రభుత్వ ధాన్యం కొను గోలు కేంద్రాల నుండి వచ్చిన దాన్యం పూర్తిగా కొనుగోలు చే సిన తర్వాత ప్రైవేట్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదే శించారు. వివిధ ప్రాం తాల నుండి వచ్చిన దాన్యం లోడు లా రీల డ్రైవర్లతో ఆయన మాట్లా డారు. మిల్లుకొచ్చిన లారీలు 12 గంటల్లో అన్లోడ్ చేసుకుని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించాల ని ఆదేశించారు.

    అవసరమైతే హ మాలీలను ఎక్కువ మందిని ఏర్పా టు చేసుకొని అన్లోడ్ ను పెంచాల న్నారు. రానున్న 10 రోజులు జిల్లా లో ధాన్యం కొనుగోలును వేగవం తం చేయాలని, ప్ర త్యే కించి ప్రభు త్వ కేంద్రాల ధాన్యం కొనుగోలును వేగవం తం చేసేందుకు ఇతర ప్రాం తాల నుండి ధాన్యం రాకుండా డిండి, అవంతిపురం తదితర ప్రాంతా లలో చెక్ ఫోస్టులు ఏ ర్పాటు చేయాలని, వ్యవసా య ,రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో బృందాన్ని ఏ ర్పాటు చేయాలన్నారు.

    అలాగే మిల్లుల వద్ద ఒక పోలీస్ కా నిస్టేబుల్ తో పాటు, జి పిఓ, ఇతర అధికారులు నిరంతరం ధాన్యం ఆ న్లోడ్ పర్య వేక్షించాలని, అందరు రై స్ మిల్లర్లు ఇదే విధానాన్ని పాటిం చాలని చెప్పారు.అనంతరం మహే శ్వరి పారాబాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చా రు. కాగా ఈ రైస్ మిల్లులో రైస్ మిల్ గుమాస్తా మా డుగుల పల్లి మండలానికి చెందిన ఒక రైతు నుండి డబ్బులు తీసు కు న్నాడని ఆరోపణలు వచ్చిన నేప థ్యంలో ఆయన అన్ని రికార్డులను పరిశీలించి వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వ హించి నివేదిక సమర్పించాలని మాడుగులపల్లి తహ సిల్దా ర్ ను ఆదేశించారు.

    అంతకుముందు కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ జిల్లాలో రబీ ధాన్యం సేకరణలోభాగం గా ఇప్పటివరకు 4 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ డం జరిగిందని, ఇంకా రెం డు లక్షల అరవై వేల మెట్రిక్ ట న్నులు దాన్యం కొనాల్సి ఉందని చెప్పారు. మిల్లర్లు త్వర త్వరగా ధాన్యా న్ని అన్లోడ్ చేసుకునేందుకుగాను ఎస్పీ తో పాటు, రైస్ మిల్లులను సందర్శిస్తున్నట్లు చెప్పారు .అన్ని రై స్ మిల్లులకు ప్రైవేటు, ప్రభుత్వ దాన్యం వస్తున్నప్పటికీ మి ల్లర్లు ప్రై వేట్ ధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వ కుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారా వ చ్చిన ధాన్యానికి ప్రాధాన్యత ఇ వ్వాలని, ప్రభుత్వ ధాన్యం పూర్తిగా కొనుగోలు జరిగిన తర్వాత ప్రైవే ట్ ధాన్యాన్ని కొనుగోలు చేయాల ని ఆదేశించారు.

    రైస్ మిల్లులు ఎంత వీలైతే అంత ధాన్యాన్ని అన్లోడ్ చేసుకో వాలని చెప్పారు.ప్రతి మిల్ పాయింట్ వద్ద ఒక అధికారిని, పోలీసును ఏర్పా టు చేస్తున్నామని, వచ్చిన వాహ నాలు 12 గంటల్లోపు ధాన్యాన్ని అన్లోడ్ చేసి తిరిగి పిపిసి కేంద్రా లకు వెళ్లిపోయేలా కార్యాచరణ ప్రణా ళిక రూపొందించా మని, రానున్న పది రోజులు జిల్లాలో ప్రైవేటు వ్య క్తుల నుం డి వచ్చిన ధాన్యాన్ని హో ల్డ్ లో పెట్టాల్సిందిగా ఆయన అధి కారులు, మిల్లర్లను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 62 శాతం దాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు.

    ఇంకా 32 శాతం కొనుగోలు చేయా ల్సి ఉందని ధాన్యం కొ నుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేలా అన్ని చర్య లు తీసుకుంటున్నామని వివరించారు. మిల్లర్లకు సంబంధించి బా యిల్డ్ కోట ఇవ్వడం, మిల్లర్ చార్జీ లు ఇవ్వ డం వంటివి పూర్తి చేయడం జరిగిoదని, అందువ ల్ల మిల్ల ర్లు సైతం పూర్తిస్థాయిలో ప్రభుత్వా నికి ,రైతులకు సహకరించాలని కో రారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొను గోలు ను ఎప్ప టికప్పుడు పర్యవే క్షించి రైతులకు ఇబ్బందులు లే కుం డా చూస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

    జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ మిల్లర్లు మిల్ పాయింట్ కి వచ్చిన వాహనాలను 12 గంటల్లో అన్లోడ్ చేసు కోవాలని, అన్లోడ్ చే సుకోవడంలో ఇబ్బందులు సృష్టిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని, పోలీస్ తరఫున మిల్లులో ఒక కానిస్టేబుల్ ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ధాన్యాన్ని దిం చుకునేం దుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల ని అన్నారు. మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డిఎ స్ఓ వెంకటేశం, తహసిల్దార్ శ్రీనివా స్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.