Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రశాంతంగా ఓట్ల లెక్కింపుకు...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రశాంతంగా ఓట్ల లెక్కింపుకు రాజకీయ పార్టీలు సహకరించాలి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా లో నల్గొండ మున్సిపల్ కార్పొరేష న్ తోపాటు,ఇతరము న్సి పాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్ర శేఖర్ తెలిపారు. గురు వారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన నల్గొండ మున్సిప ల్ కార్పొరేషన్ ఓట్ల లె క్కింపు కేంద్రాన్ని , నాగార్జునసాగర్ రోడ్ లో శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వె ల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓ ట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు .

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ ఆర్జాలబా వి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నల్గొండ మున్సిప ల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు, మి ర్యాలగూడ అవంతిపురం మార్కె ట్ యా ర్డులో మిర్యాలగూడ, నం దికొండ, హాలియా మున్సిపాలిటీ ల ఓట్ల లెక్కింపు , నల్గొండ సమీపంలో ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షి యల్ పాఠశాల లో దేవరకొండ, చండూరు చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓ ట్ల లెక్కింపు చేపడుతున్నట్లు చెప్పారు.

    మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో భాగంగా ప్రతి వార్డు కు ఒక కౌం టింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాట్లు చేయడం జరి గిందని, కౌంటింగ్ హాల్లో బ్యారి కేడింగ్ ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ,ఓట్ల లెక్కింపు ని ర్వహించే సిబ్బందికి శిక్ష ణను పూర్తి చేయడం జరిగిందని ,ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, ఇద్దరు సూపర్వైజర్లు ఉంటారని,ఆర్ఓలు ఉంటా రని,ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత, రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ప్రారం భమవుతుందని తెలిపారు. ఎక్కు వ వార్డులు ఉన్నచోట పోలింగ్ కేంద్రాలను బట్టి రౌం డ్స్ లెక్కించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

    రేపు 13 వ తేదీన ఉదయం 8 గం టలకు ఓట్ల లెక్కింపు ప్రా రంభమవుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్ల ను అనుమతించడం జరగదని, ఓట్ల లెక్కింపును ప్రశాంతం గా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉ న్న అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అ దనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.