Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda district collecter chandhrasekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టిమేటం, యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం...

    Nalgonda district collecter chandhrasekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టిమేటం, యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిందే

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda district collecter chandhrasekhar : ప్రజా దీవెన, దేవరకొండ: యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవం తం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవర కొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొను గోలు పూర్తి చేయాలని చెప్పారు.శనివారం దేవరకొండ ఆ ర్డీ వో కార్యాలయంలో యాసంగి ధా న్యం కొనుగోళ్లపై జిల్లా క లెక్టర్ బి చంద్రశేఖర్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జి ల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3. 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపా రు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు పే ర్కొన్నారు. మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రో జుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.

    దేవరకొండ డివిజన్ పరిధిలో స్థాని క ఎమ్మెల్యే సహకారంతో మిల్లర్ల స మన్వయం ద్వారా ధాన్యం వేగంగా మి ల్లులకు తరలించే చర్యలు చేప డుతున్నామని తెలిపారు. అవసర మైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు, అద నంగా కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తా మని చెప్పారు. రైతులు తీసుకొ చ్చిన ధాన్యం కళ్లాల్లో ఎక్కువ రోజులు ని ల్వ ఉండకుండా త్వరితగతిన తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధా న్యం అమ్మిన రైతులకు చెల్లింపు లు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ487 కోట్లు చె ల్లించామని తెలిపారు. డివిజన్ పరిధిలోని 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో పూర్తి స్థా యిలో సహకరించాలని కోరా రు. వర్ష సూచనలు ఉన్న నేప థ్యం లో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లు లకు తరలించాలని పేర్కొంటూ అ దనoగా 30 లారీలను పెంచామని, ప్రస్తుతం మొత్తం 100 లారీలతో 2 4 గంటల వ్యవధిలో ధాన్యం అ న్‌ లోడింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపా రు.

    ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రైతు పం డించిన చి వరిగింజ వరకు ప్రభుత్వం కొంటుం దని,ఒక వేళ వర్షానికి ధాన్యం తడి చినా కొంటుందని తెలిపారు. దేవ ర కొండ నియోజకవర్గానికి ఈసారి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపా రు. డిండి ప్రాంతంలో ఇంకా వరి కోతలు కొనసాగుతున్నా యని, అక్కడినుండి వచ్చే ధాన్యం కొను గోలుకు అనుగు ణంగా కలెక్టర్, జే సీ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగు తున్నా యని చెప్పారు. నియోజక వర్గంలోని 12 మిల్లుల మిల్లర్లు ధా న్యం స్వీకరణలో భాగస్వామ్యం కా వాలని కోరారు.

    ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోక పోతే మరిన్ని లారీ లు కూడా అం దుబాటులోకి తీసుకువస్తామని తె లిపారు. ఏ కేంద్రం లో ధాన్యం ఎ క్కువగా ఉంటే అక్కడికి వెంటనే లారీ లు పంపిస్తామని చెప్పారు. వచ్చే పది రోజుల్లో ధాన్యం కొను గోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభు త్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తశుద్ధి తో పనిచేస్తోందని. మిల్ల ర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో పనిచేస్తే ప్రతి గింజ కొనుగోలు చేసి రై తులను ఆదుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

    ఈ సమీక్ష సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీ ని వాస్, దేవరకొండ ఇంచార్జ్ ఆర్డిఓ రమణారె డ్డి, డిఎస్ ఓ వెంకటేష్, డిఎంరాం పత్తి నాయక్, డిసిఓ పత్యానాయ క్ , మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రె డ్డి, డి టి ము మీబీన్, రైస్ మిల్లర్ల తరఫున వెంకన్న, శ్రీని వా స్, అధికారులు తదితరులు హాజరయ్యారు.

       జనగణనపై ప్రజలలో అవగాహనకు ప్రచారరథం

    జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యు మరేటర్లకు సరైన సమా చారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. జనగణన అన్ని రకాల అభివృద్ధికి ముఖ్యమ ని, జనగణలో ప్రతి కుటుంబం వారి వివరాలను తెలియజేసి సహక రించాలని విజ్ఞప్తి చేశారు. జనగణ న పై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచా ర రథాన్ని శనివారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాల యం వద్ద జండా ఊపి ప్రారంభించారు.

    2027 జన గణనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదే శాల మే రకు మొదటి విడత సెల్ఫ్ ఎన్యు మరేషన్ చేపట్ట డం జరిగిందని, అ ది ఈ నెల10తో ముగుస్తుందని, ఈ నెల 11నుండి హౌస్ లిస్టింగ్, జనగణన కార్యక్రమాలను నిర్వ హించడం జరుగుతుందని, జనగ ణనకు జిల్లా యంత్రాంగం అవసర మైన అన్ని చర్యలు చేపట్టిందని, ఈ నెల 11 నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి జనాభా వివరాలు సేకరి స్తారని, ఇందుకు జిల్లాలో ని ప్రజలందరూ సరైన, పూర్తి స మాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. జనాభా వివరాల సేకరణ కేవలం జనాభా లెక్కలకు ఉద్దేశించి మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు.

    జనగణనలో ఇండ్లకు సంబంధించి న వివరాలతో పాటు, కు టుంబాల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించేం దు కు ఉద్దేశించిన ప్రచారరథం జిల్లాలోని 33 మండలాల పరిధి లో పర్యటించి జనగణనపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంద ని తెలిపా రు. జిల్లాలోని ప్రజలందరూ జనగణనకు సహక రించాలని పునరుద్ఘా టించారు. రెవెన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీనివాస్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా అధికారులు త దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.