Nalgonda District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక వి ద్య అందించి, వారిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీ ర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యాశా ఖ అధికారులను ఆ దేశించారు.శుక్రవారం కలెక్టర్ కా ర్యాల య ఉదయాదిత్య భవన్‌లో విద్యాశాఖ అధికారులతో సమీ క్షించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రా రంభమైనందున ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు స్పష్టమైన డ్యూటీ ప్లాన్‌తో పని చేయాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వి ద్యార్థుల సంఖ్య గణనీయం గా పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య త గ్గకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నా రు. ప్రైవేట్ పా ఠశాలలకు వెళ్లే వి ద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చే ర్పించేలా తల్లిదండ్రులకు అ వగాహన కల్పించాలని, ప్రైవే ట్ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులను సులభంగా చేర్చు కోవాలని సూచించారు. విద్యార్థుల చేరికల విషయంలో ఎ వరైనా ఇబ్బందుల కు గురిచేస్తే కఠిన చర్యలు తీసు కుంటా మని హెచ్చరించారు. అంగ న్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న పిల్లల వివరాలను సేక రించి సమీప ప్రభుత్వ పా ఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు.
విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందే లా చూడాలని తెలిపారు. విద్యా ర్థులకు ఆధార్ కార్డు లు, జననధ్రువపత్రాలు, నివాస, కుల ధ్రువ పత్రాలు అవసర మైన చోట తహసీ ల్దార్ల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసు కోవాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశాల్లో ఆధార్ న మోదు, ఇతర ధ్రువపత్రాల అంశాలపై అవగాహన కల్పిం చి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్ ఆర్‌ఎస్ ప్రక్రియపై ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసు కోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ న మో దు, యూనిఫాం ,స్కావెంజర్ తదితర ప్రక్రియలను నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్ ఎస్ నమో దు చేసిన తర్వాత వి ద్యార్థులను పాఠశాల వెలుపలికి పం పకుండా, వారి భద్రతకు ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వ హించాలని స్పష్టం చేశారు.అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్త కాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని తెలి పారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 25 మంది విద్యా ర్థులు ఉండేలా ఎన్రోల్మెంట్ పెంచాలని ఆదేశించారు.
ప్రతి ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఎన్రో ల్మెంట్ పెంచేందుకు ఉపా ధ్యాయులు చురుకుగా పనిచేయలన్నారు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే సమానమైన, నాణ్యమైన విద్య అం దించి వారి ఆలోచనా సామర్థ్యం,పెరిగేలా చూడాలని అన్నా రు. ప్రీ-ప్రైమరీ పాఠశాలలను సా మాజిక మాధ్యమాల ద్వా రా విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇన్‌స్టా గ్రామ్ తదితర మాధ్యమాలను వినియోగించి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెం చాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షిoచారు. విద్యార్థులకు ఉద యం అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందిం చాలని, పాఠ శాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి యాప్‌లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, గుడ్డు, బియ్యం, రాగిజావ వంటి పోషకా హారం క్రమం తప్పకుండా అందేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
వంటశాలలు, భోజన పాత్రలు, ని ల్వ గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొత్త డిజైన్‌తో వంట శాల లను నీట్‌గా నిర్వ హించాలని సూచించారు. పాత సామగ్రి ని అవసరానికి అనుగు ణంగా వినియోగించుకోవాలని, వం ట సామగ్రి సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు.ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, మాట్లాడడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను సా ధించేలా సర్వే ఆధారంగా ప్రత్యేక ప్రణా ళిక రూపొందించాలన్నారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాష ల్లో విద్యార్థులు చదవగలిగేలా, రాయగలిగేలా, మాట్లాడగ లిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యా ర్థుల్లో ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయాలని, ఒ లింపియా డ్‌లు, పోటీ పరీక్షలు, ఇ తర కాంపిటీటివ్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని విజయం సాధించేలా శిక్షణ ఇవ్వాల ని తెలిపారు.
విద్యార్థుల అభివృద్ధికి అవసరమై న బడ్జెట్ విషయంలో అ ధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లే దని, పిల్లల కోసం అవసరమైన ని ధులు అందిస్తామని కలెక్టర్ తెలి పా రు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లు అన్ని రంగాల్లో ప్రైవేట్ విద్యా ర్థులతో పోటీపడి గెలిచేలా ప్రతి ఉ పాధ్యాయుడు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమా వేశంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జి ల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఎంఈఓలు , ప్ర ధా నోపాధ్యాయులు పాల్గొన్నారు.



