Nalgonda District Collector Chandrashekhar: ప్ర జా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తపై ప్రజల్లో చైతన్యం పెం పొందిం చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన “రోడ్ సేఫ్టీ అ వేర్నెస్ ట్రీ” అవ గాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ప్రారంభించారు. సోమవారం క్లాక్ టవర్ సెంటర్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగం గా నిర్వహిస్తున్న రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమా న్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ వాహనదారులు త ప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను క చ్చితంగా పాటించా లని సూచించారు.జీవితం విలువైనది అనే సందేశంతో రోడ్డు సేఫ్టీ వృ క్షాన్ని ప్రతీకగా చూపిస్తూ, మ నిషి జీవితాన్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తూ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్య తతో వ్యవ హరిస్తేనే రోడ్డు ప్రమాదా లను తగ్గించవచ్చని తెలిపారు. హె ల్మెట్ ధరించినప్పుడు ప్రమాదం జ రిగినా ఎలా రక్షణ లభి స్తుందో, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవు తాయో ప్రదర్శన ద్వారా ప్రజలకు స్ప ష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డిటిఓ లావణ్య, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్టిఏ మెంబ ర్ రాజశేఖర్ రెడ్డి, మోటారు ఇన్స్పెక్టర్లు కొండయ్య, మల్లికా ర్జున్, భాస్కర్ రెడ్డి, ఉషశ్రీ ,సోని ప్రియ, చిరంజీవి, గోపీ నాథ్, నరేందర్ రెడ్డి, రవి పాల్గొన్నారు.

