Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Police Announcement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర...

    Nalgonda Police Announcement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక ప్రకటన, నేటి నుంచే నోహెల్మెట్, నోపెట్రోల్ నిబంధన

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Police Announcement: ప్రజా దీవెన, నల్లగొం డ: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణ యం మేరకు, నేడు బుధవారం నుంచి నల్గొండ జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రో ల్ ’ నిబంధనను అమలు చేయను న్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆ యనొక ప్రకటన విడుదల చేస్తూ ఈ నిర్ణయం ప్రకారం జిల్లా పరి ధి లోని అన్ని పెట్రోల్ బంకుల్లో హె ల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.

    ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పె ట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బం దికి ఈ నిబంధన అమలుపై స్పష్ట మైన సూచనలు ఇవ్వడం జరి గిందని, అలాగే ద్విచక్ర వాహనదారు లకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగా హన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్ర మాలు కూడా నిర్వహిం చా మని ఆ యన పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదా లలో ద్విచక్ర వాహన దా రులే అధి కంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధ రించకపోవ డం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సం భవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని,ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను త గ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడ డం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

    ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్య త్తును దృష్టిలో ఉంచుకుని తప్పని సరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వా హనం నడపాలని జిల్లా పోలీస్ శా ఖ విజ్ఞప్తి చేసింది. ప్రజల స హకారం ఉంటేనే రోడ్డు భద్రత సాధ్యమవు తుoదని, అందరూ చ ట్టాలను గౌర విస్తూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను తాము కాపాడుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.