Tuesday, September 29, 2026
More
    HomePoliticsDistrict Collector Chandrashekhar : మండల విద్యాశాఖ అధికారులు నెలలో పాఠశాలలను విధిగా సందర్శించాలి

    District Collector Chandrashekhar : మండల విద్యాశాఖ అధికారులు నెలలో పాఠశాలలను విధిగా సందర్శించాలి

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్

    District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ : మండల విద్యాశాఖ అధికారులు నెలలో వారి పరిధిలోని పాఠశాలల ను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆదేశిం చారు .ముందస్తు అనుమతి లేకుం డా ఉపాధ్యాయులు, ఎంఈఓ లు సెలవు పై వెళ్లకూడదని ,జిల్లాలో టాయిలెట్ లేని పాఠశాల ఉండరా దని , విద్యార్థులకు గుణాత్మక వి ద్యను అందించడంలో భాగంగా హె డ్మాస్టర్లతో తరచూ సమీక్షలు నిర్వ హించాలని ఆదేశించారు. సోమవా రం అయన కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న పీఎం శ్రీ పాఠశాలలు, టాయిలెట్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు .

    రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ ప థకాల కింద పాఠశాల విద్యార్థులకు మంజూరు చేసిన నిధులన్ని సద్వి నియోగమయ్యాలా చూడాలని, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్, బాలికల ఆరోగ్యం, శానిటేషన్, సై న్స్, మ్యాథ్స్, సర్కిల్స్ నిర్వహణ, ఎక్స్పోజర్ విజిట్లు, స్పోర్ట్స్ మెటీరి యల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పెల్ఫ్ డిఫెన్సె,మాక్ పార్లమెంట్ నిర్వహ ణ, సేఫ్టీ క్లబ్బుల ఏర్పాటు, టీచర్ పేరెంట్స్ మీటింగ్ లు, తదితర విష యాలపై సమగ్రంగా సమీక్షించారు.

    బాలికల హైజీన్,శానిటేషన్ ఆరో గ్యం విషయంలో రాజీ పడవద్దని, మ్యాథ్స్, సైన్స్ సర్కిల్ల వల్ల నూత న ఆవిష్కరణలు చేసే విధంగా వి ద్యార్థులను తయారు చేయాలని, విద్యార్థులకు ప్రఖ్యాత ప్రదేశాలు, స్థ లాలు సందర్శించడం ద్వారా స మాజంపై అవగాహన కలిగే విధం గా ఎక్స్పోజర్ విజిట్లు నిర్వహిం చాలని, వీటిని నెల 17, 18 లో పూర్తి చేయాలన్నారు. స్పోర్ట్స్ మెటీ రియల్, స్కౌట్స్ అండ్ గేమ్ మెటీరి యల్ నాణ్యతతో ఉండాలన్నారు.

    ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మంజూ రు చేసిన మెటీరియల్ అంతా సరి చూసుకోవాలని, జిల్లాలో ఇంకా మె టీరియల్ తెప్పించని పాఠశాలలన్నీ ఈ నెల పది లోపల తెప్పించడమే కాకుండా, స్టాక్ రిజిస్టర్ లో నమో దు చేయాలన్నారు. స్పెల్ఫ్ మాక్ పార్లమెంట్ తదితర కార్యక్రమా ల ను ద్వారా మహిళా విద్యను ప్రోత్స హించేందుకు పరోక్షంగా ఉపయోగ పడతాయని, సేఫ్టీ క్లబ్ ల నిర్వహ ణ, ఆయా అంశాలపై నిష్ణాతులను పిలిపించి విద్యార్థులకు సెమినార్లు ఏర్పాటు చేయాలని, పాఠశాల విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలలో వాల్ ను ఏర్పాటు చేసి వారికి నచ్చిన విధంగా బొమ్మలేసేలా చూడాలన్నారు.

    తల్లిదండ్రుల సమావేశాలను అర్థ వంతంగా నిర్వహించాలని అన్నా రు. చిన్నచిన్న కారణాలవల్ల జిల్లా లో మూతబడిన టాయిలెట్స్ అ న్నింటిని తిరిగి వినియోగం లోకి తె చ్చేందుకు పంచాయతీరాజ్ అసి స్టెంట్ ఇంజనీర్ ద్వారా అంచనాలు వేయించి సమర్పించాలని, జిల్లాలో టాయిలెట్ లేని పాఠశాల అన్నది ఉండకూడదని అన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎంఈ ఓ లు, తదితరులు ఈ సమావేశా నికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.