Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda police ganja Megha operation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీసుల...

    Nalgonda police ganja Megha operation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీసుల మెగాఆపరేషన్, అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాగుట్టురట్టు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda police ganja Megha operation :  ప్రజా దీ వెన, నల్లగొండ: యువత భవిష్యత్తును విషపూరితం చేస్తు న్న మాదకద్రవ్యాల మాఫియాపై న ల్గొండ పోలీసులు మరో భారీ దెబ్బ కొట్టారు. కేతేపల్లి పోలీసులు అప్రమత్తంగా వ్యవ హరించి అంతర్‌రా ష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛే దిం చి దాదాపు రూ.52.5 లక్షల వి లువైన 104.5 కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు లో ఇద్దరు నింది తులను అరెస్ట్ చే యగా, ప్రధాన సూత్రధారులుగా భావి స్తు న్న మరో ముగ్గురి కోసం ప్ర త్యేక బృందాలతో గాలింపు కొ నసాగుతోంది. కాగా ఈ విషయాన్ని న ల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం నల్లగొండలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

    నల్లగొండ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఎస్పీ ఆదేశాల మే రకు వాహ నాల తనిఖీలు, నాకాబందీలు, అ నుమానా స్ప ద కదలికలపై పోలీ సులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నా రు. ఈ క్రమంలో కేతేపల్లి ఎస్సై సతీష్ కు విశ్వసనీయ స మాచారం అందింది.విజయవాడ వైపు నుంచి హైదరాబా ద్‌కు భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మే రకు పోలీసులు, క్లూస్ టీమ్, పం చులతో కలిసి కొర్లపహాడ్ టోల్‌ప్లా జా సమీపంలో మాటువేసి తనిఖీ లు చేపట్టారు.

       లారీ ఆపగానే పరారికి ప్రయత్నం

    ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న HP-38-F-3447 నంబర్ గల గ్రీన్ కల ర్ అశోక్ లే లాండ్ లారీ అనుమానాస్పదంగా కనిపించడం తో పోలీసులు అడ్డ గించారు. తనిఖీలు ప్రారంభించగానే లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి పారిపోవడానికి ప్ర యత్నించారు. అయితే అప్రమత్త మైన పోలీసులు వారి ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.లారీ వె నుక భాగా న్ని తనిఖీ చేయగా నా లుగు భారీ ప్లాస్టిక్ బస్తాల్లో బ్రౌన్ టే ప్‌తో ప్యాక్ చేసిన గంజాయి ప్యాకె ట్లు బయటపడ్డాయి. మొత్తం 103 ప్యాకెట్లు సుమారు 104.5 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

    ఇదిలా ఉండగా పరంవిర్ సింగ్ (4 2), షా అలం పర్వేష్ ఆలం అ న్సా రి (37) లని అరెస్టు చేయగా బిక్రం సింగ్, ఫరూక్, భావులు ము గ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్ల డించారు. విచారణలో నిందితులు సంచలన విష యా లు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజం జి ల్లా భిష్మగిరి అడవుల్లో భావు వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, ముంబైకు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు.

    ఈ స్మగ్లింగ్ రూట్‌లో జమ్మూ, ముం బై, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నిం దితుల నెట్‌వర్క్ పనిచేస్తోందని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా రెండు సార్లు ఇదే తరహాలో గంజాయి రవాణా చేసినట్లు నింది తులు అంగీకరించారు. ఈసారి భా రీ మొత్తంలో గంజాయి తరలిస్తే రూ.1 లక్ష ఇస్తా మని చెప్పడంతో ఈ అక్రమ రవాణాకు ఒప్పుకున్నట్లు వెల్ల డించారు. అయితే 104.5 కేజీల గంజాయి, అశోక్ లేలాండ్ లారీ (HP-38-F-3447), రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పర చుకున్నారు.

        డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ మాద కద్రవ్యాల అక్రమ రవాణా యువత భవిష్యత్తు ను నాశనం చేస్తోంది. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొ నసాగుతున్నాయి. అక్ర మ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఈ కేసును నల్లగొండ డీ ఎస్పీ శివ రాంరెడ్డి పర్యవేక్షణ లో నకిరేకల్ సీఐ హరిబాబు ఆధ్వర్యంలో ఛేదించారు.భారీ మొత్తం లో గంజాయిని స్వా ధీనం చేసుకు న్న కేతేపల్లి ఎస్సై సతీష్ తో పాటు పోలీసు సిబ్బంది బి. వెంకటేశ్వర్లు, బి. వెంకట కృష్ణ, స్వామి, వెంకన్న, బాసిత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.