Nalgonda police speed investigation: ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్లగొండలో కుటుంబ వేధింపులపై పోలీ సులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న భవిష్యత్ దిశ స్ప ష్టమవుతోంది. తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటనకు సంబంధించి నల్లగొండ టూటౌన్ పోలీసులు వేగంగా స్పందిం చి నిందితుడిని అ దుపులోకి తీసుకున్నారు.ఐదు నెలల క్రి తం పెళ్లైన యువతి ఐశ్వర్య (20) జీవితం కుటుంబంలోనే ఎదురైన మానసిక హింసతో చీకటిలో కలిసిపోయింది. నాం పల్లి మండలం మహ్మదాపురం నుంచి పానగల్లుకు వచ్చిన ఆమెకు భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రేలింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు విచారణలో బయటప డింది.
చిన్న చిన్న విషయాలకు అవమా నించడం, మాటలతో కృం గదీస్తూ “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వ స్తుంది” అనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటి మానసి క హిం సను ఆమె భరించలేకపోయిందని పోలీసులు వెల్లడించా రు.ఈ నెల 18వ తేదీన ఉదయం ఈ వేధింపులకు తట్టు కో లేక ఐశ్వర్య పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసు కుని ఆత్మ హత్యకు పాల్పడింది.ఈ ఘటనపై మృతురాలి తండ్రి చింత ల వెంకటయ్య ఫిర్యాదు చేయడం తో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేష న్‌లో కేసు నమోదు అయింది.టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగ వంతం చేయగా కొలిక్కి వచ్చిన ఈ కేసు వివరాలు టూ టౌన్ సీఐ రాఘవరావు మీడియా స మావేశంలో వెల్లడించారు.
పోలీసులు BNS సెక్షన్లు 95, 108 కింద కేసు నమోదు చేసి, నిందితు డు వర్రే లింగయ్య (45)ను సోమ వారం ఉదయం అతని నివాసంలో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ను స్వాధీ నం చేసుకుని, కోర్టులో హాజరు పర చేందుకు రిమాండ్‌కు తరలించా రు.కోడలిపై లేదా కుటుంబ సభ్యు లపై మానసిక, శారీరక వేధింపుల కు పాల్పడిన వారిపై ఇకపై కఠిన చ ర్యలు తప్పవని నల్లగొండ పోలీసు లు స్పష్టం చేశారు. కుటుంబంలో గౌరవం, పరస్పర మద్దతు లేకపోతే ఇలాంటి విషాదాలు పునరావృత మవుతాయని నిపుణులు హెచ్చ రిస్తున్నారు.
