Nalgonda quadruple murder solved : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండను కుదిపేసిన నలుగురి దారుణ హత్య ల కేసులో పోలీసులు సంచలన నిజాలను ఛేదించారు. కన్న ప్రే మను, బంధాలను మర్చిపోయి కేవలం రూ. కోటి విలువై న ఆస్తి కోసం ఒకే కు టుంబానికి చెందిన నలుగురిని నర రూప రాక్షసులు ఎలా బలితీసుకున్నారో విచారణలో వెల్ల డైంది.
ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైనా సమాచారం మేరకు ఇది ఎవరో బయటి వ్యక్తులు చేసిన హత్యలు కావు ఇంట్లో ని వారే నడిపి న నెత్తుటి కథ ఇలా ఉంది. మృతురాలు హ సీన మొదటి భర్త కూ తురు, అల్లుడు, మరియు అల్లుడి అ క్క కలిసి ఈ ఘాతుకానికి కుట్ర పన్నారు.వీరు స్వయంగా కాకుం డా హైదరాబాద్ పాతబస్తీకి చెంది న నలుగురు రౌడీ షీటర్లకు భారీ మొత్తంలో సుపారీ (డబ్బులు) ఇచ్చి ఈ దా రుణానికి ఒడిగట్టారు.

ఆస్తి కోసమీ ఘాతుకం
హసీన పేరు మీద సుమారు కోటి రూపాయల విలువైన స్థి రాస్తులు ఉన్నాయి. అయితే ఆ ఆస్తిని మొ దటి భర్త సం తానానికి కాకుండా.. ప్రస్తుత భర్త సుల్తాన్ పిల్లలకే ఇవ్వా లని హసీన నిర్ణయించుకుంది. దీంతో కక్ష పెంచుకున్న మొ దటి కూతురు, అల్లుడు పక్కా ప్లాన్‌తో సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.
పోస్టుమార్టంరిపోర్ట్ లో భయానకనిజాలు.
నిందితులు ఎంతటి క్రూరంగా ప్రవర్తించారో పోస్టుమార్టం ని వేదిక చూస్తే అర్థమవుతోంది. నలుగురిని క త్తులతో నరికి నరకకూపంలోకి నె ట్టారు. సుల్తాన్ (45) శరీరంపై 6 కత్తిపో ట్లు, హసీన (40) 7 కత్తిపో ట్లు, ముజమిల్ (20) ఏకంగా 16 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా చం పారు. అదే సమయంలో అక్సర (11) ఊహించని ఈ దాడికి భయ పడిపోయి ప్రాణా లు అరచేతిలో పెట్టుకునిమంచం కింద దాక్కున్నప్పటీకి ఆ చిన్నారిని సైతం వదలకుండా బయటకు లాగి 9 కత్తిపోట్లు పొడిచి కర్కశంగా ప్రాణాలు తీశారు.
ఈ మేరకు కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటి కే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచా రి స్తున్నారు. సుపారీ గ్యాంగ్‌తో పాటు ఈ హత్యాకాండ వెను క ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ము మ్మరం చేశారు. త్వరలోనే మరిన్ని సంచలన నిజాలు వెలు గులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిం చాయి.

