Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda sensational tragedy deaths: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ తెలంగాణ కాలనీలో విషాదం, మిస్టరీగా ఒకే...

    Nalgonda sensational tragedy deaths: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ తెలంగాణ కాలనీలో విషాదం, మిస్టరీగా ఒకే ఇంట్లో 4కుళ్లిపోయిన మృతదేహాలు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda sensational tragedy deaths : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో గురువారం తీవ్ర కలకలం రేగింది. ఒకే ఇల్లు.. నా లుగు ప్రాణాలు.. నిశ్శబ్దంగా గాల్లో కలిసిపోయాయి. మూసి ఉన్న ఒక ఇల్లు ఇప్పుడు నల్లగొండలో ఒక పెద్ద మిస్టరీగా మారింది.గత కొన్ని రోజులుగా ఆ ఇల్లు తా ళం వేసి ఉంది. అయితే, ఈరోజు ఉదయం నుండి ఆ ఇంటి పరిసరాల్లో త  ట్టుకోలేనంత దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమా నం వచ్చింది. వెంటనే వారు పోలీసుల కు సమాచారం అం దించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసు లకు లోపల ఉన్న దృశ్యం చూసి గుండె జారినంత పనైంది. ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉ న్న నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

    నల్లగొండ ప్రకాశం బజార్ లో బ్యా గుల వ్యాపారం చేసే మహమ్మద్ సుల్తాన్, ప్రైవేట్ పాఠశాలలో ఉ పాధ్యాయు రాలిగా పనిచేస్తున్న అతని భార్య హసీనా సుల్తాన్ లతో పా టు ఇంట్లో ఉన్న మరో ఇ ద్దరి మృతదేహాలు కూడా లభ్య మ య్యాయి. వీరు వీరి పిల్లలా లేక బంధువులా అనేది తెలి యాల్సి ఉంది.

       పోలీసుల ప్రాథమిక అంచనా

    మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి చూస్తే.. వీరు దా దాపు నాలుగు రోజుల క్రితమే మరణించి ఉండవ చ్చని పోలీసులు భా విస్తున్నారు.ఘటన తీవ్రత దృష్ట్యా అ దనపు ఎస్పీ జి. రమేష్ స్వయంగా క్లూస్ టీమ్‌తో కలిసి సం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇ ల్లంతటినీ జల్లెడ పట్టి ఆ ధారాలు సేకరిస్తున్నారు. ఇది ఆత్మహత్యా? హత్యాలా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

    నాలుగు రోజుల పాటు కాలనీ వాసులు ఎందుకు గమనించ లేకపోయారు. ఆర్థిక ఇబ్బందులా లేక మరేదైనా గొడవలా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు నల్లగొండ జిల్లా కేంద్రం వ్యా ప్తంగా సంచలనంగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వే గవంతం చేశారు. పోస్ట్‌మార్టం నివే దిక వస్తేనే ఈ నలుగురి మృతి వెనుక ఉన్న అసలు రహ స్యం బయటపడనుంది. ఇదిలా ఉంటే సంఘటన స్థలాన్ని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి వివరాలు సేకరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.