Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda Social media missus : బిగ్ బ్రేకింగ్, జర్నలిస్టులపై సోషల్ మీడియా అటాక్,...

    Nalgonda Social media missus : బిగ్ బ్రేకింగ్, జర్నలిస్టులపై సోషల్ మీడియా అటాక్, డీఎస్పీకి ముక్తకంఠంతో జర్నలిస్టుల ఫిర్యాదు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Social media missus :   ప్రజా దీవెన నల్ల గొండ క్రైమ్: నిజాలు రాసే కలాలపై నిందల దాడి ఎ క్కు వైంది. ప్రజా సమస్యలు, అవి నీతిపై గళమెత్తే జర్నలి స్టు లను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కు ట్రలపై నల్లగొం డ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలైన పాత్రికేయులను ‘నకిలీలు’గా చిత్రీకరిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ముఠాల ఆటక ట్టించాలని డిమాండ్ చేస్తూ శనివారం జర్నలిస్టులు భారీ ఎ త్తున తరలివెళ్లి డీఎస్పీ శివరాం రెడ్డికి వినతిపత్రం సమర్పిం చారు.

    ‘జనoసాక్షి’ దినపత్రిక నల్లగొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కొద్దిరోజులుగా జరుగుతున్న నిరా ధార, అసత్య ప్రచారాలను జర్నలి స్టు సంఘాలు తీవ్రంగా ఖండించా యి. పాత్రికేయుల విశ్వసనీయ త ను, మనోధైర్యాన్ని దెబ్బతీ సేందుకు జరుగుతున్న కుట్రలను ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరిం చారు.మీడియా స్వేచ్ఛ ముఖ్యం ఫోర్త్ ఎస్టే ట్‌పై జరుగుతున్న ఈడిజిటల్ దాడుల నుంచి మీడియా స్వే చ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల భద్రతకు తగిన చర్యలు తీ సుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


    నల్లగొండ డీఎస్పీ సీరియస్ యాక్షన్

    జర్నలిస్టుల ఆవేదనపై డీఎస్పీ శివరాం రెడ్డి తక్షణమే సా నుకూలంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా జర్న లిస్టుల ప్రతి ష్టకు భంగం కలిగిస్తున్న నిందితులను వెంటనే గుర్తించి, చట్టపర మై న చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ సీ ఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావుల ను డీఎస్పీ ఆదేశించారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షిం చేది లేదని స్పష్టం చేశారు.

    వినతిపత్రం సమర్పించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మద్ద తుగా నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు, టి యుడబ్ల్యూజే గుండగోని జయశంకర్ గౌడ్, నాయకులు గాదె రమేష్, మల్లికార్జున్ యాదవ్, యాదగిరి, స లీం, అల్లిమల్లికార్జున్, దండంపల్లి రవి, వెంకట మధు, కు షాల్ చారి, శంకర్, హరి, సుధాకర్, ఎండీ కలీ మ్ ఖాన్, నవీ న్, సైదులు, శివ, సూర్య, సాగర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.