Tuesday, September 29, 2026
More
    HomeOpinionNarsimhulapet ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో నర్సిం హులపేట ఎంపిడివో, ఎంపీఓ...

    Narsimhulapet ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో నర్సిం హులపేట ఎంపిడివో, ఎంపీఓ కు మారుడు

    📰 Generate e-Paper Clip

    Narsimhulapet ACB Trap : ప్రజా దీవెన, మహబూబా బాద్: ప్ర భుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే పని జరు గుతుందేమో కానీ, అదే లంచం ప్రాణాల మీదకు తె స్తుందని మరోసారి నిరూపించారు అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు. నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయం వేదికగా సా గిన ఓభారీ లంచం భాగోతం తాజాగా రట్టయిం ది. ఓ లేఅవుట్ అ భివృద్ధి పనులకు సంబంధించి, ని బంధ నల ప్రకారం ఫిర్యాదుదారు నికి చెందిన 15.75 శాతం భూ మిని పడమటిగూడెం గ్రామ పంచాయతీకి తాకట్టు పెట్టాల్సి ఉంది. దీ నికి సంబంధించిన ఆదేశాలను గ్రామ పంచాయతీ కార్యదర్శికి జారీ చేయాలి.

    అధికారికంగా చేయాల్సిన ఈ చి న్న పని కోసం అధికారులు పెద్ద స్కెచ్చే వేశారు. దీనికోసం నర్సిం హులపేట ఎంపీడీవో పెనుగొండ రాధిక (AO-1), ఎంపీఓ శ్రీ కె. యాకయ్య (AO-2)లు సదరు బాధితు డిని పీడించడం మొదలుపెట్టారు. ఎం పీడీవో రాధిక రూ. 20,000, ఎంపీఓ యాకయ్య రూ. 25,00 0 లంచం డిమాండ్ చేశారు. రాధిక నేరుగా డబ్బులు తీసు కోకుండా, తన వ్యక్తిగత సహాయకుడు మరియు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న త న సొంత కుమారుడు సి. నాగార్జున (A-3) ద్వారా ఈ లంచం సొ మ్మును స్వీకరించింది. ఈ పని కో సం నిందితులు 1,2 అం తకుముందే ఫిర్యాదుదారుని నుం డి వరుసగా రూ. 30,000, రూ. 25,000 నొక్కేయడం గమ నార్హం.

      రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

    బాధితుడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన వరం గ ల్ రేంజ్ ఏసీబీ అధికారులు పక్కాప్లాన్ వేశారు. నర్సింహు లపేట ఎంపీడీవో కార్యాలయంలోని ఆమె ఛాంబర్‌లోనే లం చం సొమ్ము తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు. నిందితులు 2,3ల వద్ద నుండి లంచం సొమ్మును రికవరీ చేశారు.తమ అధికారిక విధులను పక్కన బెట్టి, అక్రమ సంపాదనకు అలవా టు పడిన ముగ్గురు నిం దితులను (రాధిక, యాక య్య, నాగార్జున) ఏసీబీ అధికా రులు అరెస్ట్ చేశారు. వారిని వరంగల్‌లోని SPE & ACB కే సుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.