Monday, September 28, 2026
More
    HomeOpinionOrr tragedy Accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర విషాదం, ఆగిన లారీని కారు...

    Orr tragedy Accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర విషాదం, ఆగిన లారీని కారు ఢీకొని ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం 

    📰 Generate e-Paper Clip

    Orr tragedy Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరోసారి నె త్తురోడింది. 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో చోటు చేసు కున్న భీకర ప్రమాదం ఒకే కుటుంబాన్ని చిదిమేసింది. అతి వేగం, అజాగ్రత్త వెరసి ఆరుగురు ప్రాణాలను గాలిలో కలిపే సింది.

    సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి..మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, రాజేంద్రనగర్ వై పు వెళ్తున్న ఒక కారు, 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివే గంగా ఢీకొట్టింది. కారు లారీ కింద కు దూసుకుపోవడంతో వాహనం నుజ్జునుజ్జయింది.

    కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో ఇద్దరు పసిపిల్లలు ఉండ టం అందరినీ కలిచివేస్తోంది. మృ తులను సిరిసిల్లకు చెందిన బీఆర్ ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోద రుడు బొల్లి రాజు కుటుంబ సభ్యు లుగా పోలీసులు గుర్తించారు.

    ఈ ఘోర ప్రమాదం గురించి తెలి యగానే సిరిసిల్ల నియో జ కవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నా యి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. రాoమో హన్ కుటుంబానికి జరిగిన ఈ నష్టం పూడ్చలేనిది. ఈ కష్ట కాలంలో పార్టీ వారికి అండగా ఉంటుందని ప్రకటించారు.

    కేటీఆర్ స్వయంగా రాంమోహన్‌కు ఫోన్ చేసి, ధైర్యం చెప్పా రు. బాధి తులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహ కారాలు అందించా లని స్థానిక నేతలను ఆదేశించారు హై వేలపై, ముఖ్యంగా ఓఆర్ఆర్ పై నిబంధనలకు విరుద్ధంగా లారీల ను నిలపడం ప్రాణాంతకంగా మా రుతోంది.

    రాత్రి వేళల్లో ఆగి ఉన్న వాహనాలకు ఇండికేటర్లు లేకపో వడం. కారు నియంత్రించలేని వే గంతో ఉండటం వల్లే ప్ర మాద తీ వ్రత పెరిగింది. ఓఆర్ఆర్ పై ప్రయాణించే వారు ఎ గ్జిట్ పాయింట్ల వద్ద అత్యంత జాగ్ర త్తగా ఉండాలని, రోడ్డుపై వాహనా లను ఆపడం చట్టరీత్యా నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.