Sunday, September 27, 2026
More
    HomeOpinionPD Act on paddy missing : బిగ్ బ్రేకింగ్, రూ. 73 కోట్లధాన్యం 'గల్లంతు'...

    PD Act on paddy missing : బిగ్ బ్రేకింగ్, రూ. 73 కోట్లధాన్యం ‘గల్లంతు’ డ్రామా, టీఆర్పీ నేత వట్టె జానయ్యపై పీడీ యాక్ట్ ఉక్కుపాదం ?

    📰 Generate e-Paper Clip

    PD Act on paddy missing : ప్రజా దీవెన, సూర్యా పేట: రైస్ మిల్లుల చాటున సాగిన అపార ధాన్యం దందా గుట్టు రట్టైం ది. కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసిన వ్యవహా రంలో టీఆర్పీ జనర ల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌కు విజిలె న్స్ అధికారులు షాకి చ్చారు. సామాన్య నేరారోప ణ లతో సరిపెట్టకుండా ఆయనపై ఏకంగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

      మిల్లుల్లో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు

    సూర్యాపేట జిల్లా బాలెంల పరిధి లోని ‘వజ్ర రైస్ కార్పొరేష న్’, ‘వజ్ర వికాస్ రైస్ మార్ట్’ మిల్లులలో విజిలెన్స్ అండ్ ఎ న్ఫోర్స్మెంట్ అధి కారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అ క్కడ రికార్డులను పరిశీలించిన అధికారులకు మైండ్ బ్లాంక య్యే నిజాలు వెలుగుచూశాయి. ఈ లెక్కింపులో ఏకంగా 29,188 టన్నుల ధాన్యం మాయమైనట్లు తేలింది.మార్కెట్లో ఈ ధాన్యం విలువ దాదాపు రూ. 73 కోట్లు ఉంటుందని అ ధికారులు అంచనా వేస్తున్నారు.

     

      సీన్ లోకి లారీలు.. కొడుకు అరెస్ట్, తండ్రి పరార్

    విచారణను ముమ్మరం చేసిన విజిలెన్స్ బృందం, ‘సత్యసా యి రై స్ కార్పొరేషన్’ పేరుతో నల్లబజారుకు ధాన్యాన్ని తర లిస్తున్న లారీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్వాధీనం చే సుకుంది. ఈ నెట్‌వర్క్ వెనుక ప్రధాన సూత్రధారి వట్టె జా న య్యేనని ప్రాథమిక ఆధారాలు లభించాయి.ఈ కేసులో ఇ ప్పటికే జానయ్య కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి జై. లుకు పంపగా ప్రధాన నిందితుడైన వట్టె జానయ్య మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీస్ బృందా లు గాలిస్తున్నాయి.

    ‘పీడీ యాక్ట్’ ఎందుకు ప్రయోగించారంటే..

    కేవలం ధాన్యం దొంగతనం కాకుండా, ప్రజారోగ్యం, ప్రభుత్వ ఖజా నాకు విఘాతం కలిగించేలా భారీ స్థాయిలో అక్రమా లకు పాల్పడ టంతో అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగ ణించారు. జానయ్యను చట్టం ముందు నిలబెట్టేందుకు, భ విష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేం దుకు విజిలెన్స్ శాఖ ఆయనపై పీడీ యాక్ట్ మోపేందుకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసినట్లు వెళ్లడవుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది పె ద్దల హస్తం ఉందనే దానిపై అధికారులు మరింత లోతైన విచారణ జరుపుతు న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.