Tuesday, September 29, 2026
More
    HomeOpinionPeddapalli surprise AE ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వేటలో చిక్కిన పెద్ద...

    Peddapalli surprise AE ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వేటలో చిక్కిన పెద్ద పల్లి ఏఈ, ఆపరేషన్ శ్మశాన వాటిక రూ.2లక్షల లంచం, ఇంట్లో కోట్ల గుట్టురట్టు 

    📰 Generate e-Paper Clip

    Peddapalli surprise AE ACB Trap : ప్రజా దీవెన పెద్ద పల్లి: పెద్దపల్లిలో ఒక పక్క చనిపోయిన వారి అంతి మ సం స్కారాల కోసం శ్మశానవాటి కల అభివృద్ధి పనులు జరిగా యి. కానీ, అక్కడి మున్సిపల్ ఆఫీసు లో ఉన్న ఒక అధికా రికి మాత్రం ‘అవినీతి ఆకలి’ తీరలేదు. చివరికి, అదే శ్మశాన వాటిక బిల్లుల వ్యవహా రం ఆయన పాలిట యమపాశం గా మారింది. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడమే కాకుండా, ఇంట్లో దాచిన నోట్ల కట్టల గుట్టు కూడా రట్టయిం ది.

    పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెనుగువాడ హిందూ శ్మశానవాటి క, కునారం రోడ్డు శ్మశానవాటికల అభివృద్ధి పనులు (ప్యాకేజీ-IX) పూర్తయ్యాయి. దీనికి సంబంధిం చిన ఫైనల్ బిల్లు విలువ అక్షరాలా రూ. 12,28,748/-. ఈ బిల్లు ను ప్రాసెస్ చేసి, హైదరాబాద్‌లోని తె లంగాణ అర్బన్ ఫైనా. న్స్ అండ్ ఇ న్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUF IDC) కి పంపించాల్సి ఉంది.

    ఇక్కడే పెద్దపల్లి మున్సిపల్ కార్యా లయ అసిస్టెంట్ ఇంజనీ ర్ (AE) కల్లెపల్లి సతీష్ కుమార్ (33) తన ‘అధికార బలా న్ని’ ప్రదర్శించాడు. సంతకం కావాలంటే రూ. 2,00,0 00/- (రెండు లక్షలు) లంచం ఇ వ్వాల్సిందేనని కాంట్రాక్టర్‌/ఫిర్యా దుదారుడిపై ఒత్తిడి తెచ్చాడు.

        ట్విస్ట్ ఇక్కడే.. ఏసీబీ రంగప్రవేశం

    లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ వ్య క్తి.. నిశ్శబ్దంగా కరీంనగర్ ఏసీబీ (A CB) అధికారులను ఆశ్రయించా డు. అంతా ప క్కా ప్లాన్. జూలై 14, 2026.. సతీష్ కుమార్ తన నివా సం లో ఆ రెండు లక్షల రూపాయల లంచం సొమ్మును చేతిలోకి తీసు కున్న ఆ మరుక్షణమే.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఏసీ బీ అధికారులు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సతీష్ కుమా ర్ ముఖం తెల్లబారి పోయింది. అధికారులు ఆ రూ. 2 లక్షల ను స్వాధీనం చేసుకున్నారు.

    సతీష్ కుమార్ పట్టుబడిన తర్వా త ఏసీబీ అధికారులు ఆ యన ఇం ట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ లభించిన నిధు లు చూసి అధికారులే విస్తుపోయారు. ఎటువంటి లెక్కా ప త్రం లేని రూ. 32,31,900/- (32 లక్షల ముప్పైఒక్క వేలు) నగదు ను కూడా అధికారులు సీజ్ చేశారు.

    ఇదిలా ఉండగా తన విధిని పక్క నబెట్టి, అక్రమ ప్రయోజనా ల కోసం పాకులాడిన ఏఈ సతీష్ కుమార్‌ ను ఏసీబీ అధి కారులు అరెస్ట్ చేశా రు. ఆయన్ను కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయ మూర్తి ముందు హాజరుపరి చారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగు తోం ది.భద్రతా కార ణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివ రాలను గోప్యంగా ఉంచారు.

    కాగా ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఏ అధికారి అయి నా లం చం డిమాండ్ చేస్తే భయపడకండి. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెం డూ నేరమే. అవినీతిపై పోరాడటానికి తె లంగాణ ఏసీబీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. టోల్ ఫ్రీ నం బర్ 1064, వాట్సాప్ 9440446 1 06, ఫేస్‌బుక్ Telanga na ACB,X (ట్విట్టర్) @Telangana ACB తదితర సోషల్ మీడియా వేదికల ను చూపుతూ మీ పేరు మరియు వివరా లు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు వెల్ల డిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.