Tuesday, September 29, 2026
More
    HomeIndiapolavaram project visited Foreign expert team : బిగ్ బ్రేకింగ్, పోలవరం ప్రాజెక్టులో...

    polavaram project visited Foreign expert team : బిగ్ బ్రేకింగ్, పోలవరం ప్రాజెక్టులో విదేశీనిపుణుల బృంద సభ్యుడి పర్యటన, డయాఫ్రమ్ వాల్ పై సమీక్ష

    📰 Generate e-Paper Clip

     

    polavaram project visited Foreign expert team:  ప్రజా దీవెన, పోలవరం:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగు తున్న తీరుపై విదేశీ నిపుణుల బృందం సం తృప్తి వ్యక్తం చే సింది. ఎలాంటి నా ణ్యతాలోపం లేకుండా ప్రణాళికా బద్దం గా నిర్ణీతకాల వ్యవధిలో ప నులు జరుగుతున్నాయని తొ లిరోజు పర్యటనలో బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్ట్ ని ర్మాణ తీరు పరిశీలించి సూచనలు, సలహాలు ఇ వ్వటానికి నియమించి న అంతర్జాతీయ నిపుణుల బృం దం బుధవారం నుంచి మూడు రో జుల పాటు పోలవరం ప్రాజె క్టులో పర్యటిస్తోంది. ఈ బృందం సభ్యు డు సీన్ హించిబెర్గెర్ తొలి రోజు ప్రా జెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించటంతో పా టు పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు.

    మధ్యాహ్నం ఒంటిగంట సమయం లో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాం తానికి చే రుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ జ లవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి శశిభూషణ్ కుమార్ స్వా గతం ప లికారు. ఇటీవలే శశిభూష ణ్ కుమార్ జలవనరుల శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యత లు చేపట్టిన విషయం తె లిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తరు వాత విదేశీ ని పుణుల బృందం ప ర్యటించటం ఇదే తొలిసారి. విదేశీ నిపు ణుల బృందం సభ్యుడు బెర్గెర్ తో పాటు కేంద్ర జల వనరుల సం ఘం చీఫ్ ఇంజనీర్ సరబ్జిత్ సింగ్ బక్షి, డైరెక్టర్ మనీష్ రాథోర్, ఉప సంచాలకులు అశ్వనీ కుమార్ వ ర్మ, గౌరవ్ తి వారీ , జలవనరుల శా ఖ ఉప కమిషనర్ గౌరవ్ సింఘా య్, కేంద్ర మట్టి, పదార్ధాల పరిశో ధనా కేంద్రం శాస్త్రవేత్తలు సచిన్ గు ప్త, రవి అగర్వాల్ పర్యటించారు.

    పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్య నిర్వహణ అధికా రి సంజీవ్ వోహ్రా, సభ్య కార్యదర్శి ఎం రఘు రామ్, చీఫ్ ఇం జనీర్ ఎం రమేష్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈఎన్సి కే నరసింహ మూ ర్తి, ఎస్ ఈ ఆర్ రామచంద్రరావు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐ ఎ ల్ ) చీఫ్ జన రల్ మేనేజర్ రఫీ, పో లవరం ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్ గంగాధర్, డెప్యూటీ జన రల్ మేనేజర్ మురళి పమ్మి తదిత రులు విదేశీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి బృందం పర్యటన, సమీక్షలో పాల్గొన్నారు.

    తొలుత విదేశీ నిపుణుడు బెర్గెర్, కేంద్ర అధికారుల బృందం ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షిం చింది. పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ రామచంద్ర రావు జరిగిన పనులు, ప్రస్తుతం ప్రధానంగా జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బెర్గెర్ తో పాటు కేంద్ర బృం దం సభ్యులు పనులు జరిగిన, జరుగు తున్న తీరుపై సంతృ ప్తి వ్యక్తం చేశా రు. తాము గత సమావేశాల్లో చేసిన సూచ నలు, సలహాలు పాటిస్తూ ఎప్పటికపుడు నిర్మాణాన్ని వేగ వంతంగా చేశారని చెప్పారు. అవసర మైన అనుమతులు తీసుకు రా వ టంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అ ధికారులు, నిర్మాణ సంస్థ సమ న్వయంతో పని చేయటం వల్లే ఇది సా ధ్యమైందన్నారు. ప్రాజెక్ట్ నిర్మా ణంలో భాగస్వాములైన వా రందరిని అభినందించారు.

    సమీక్షా సమావేశం అనంతరం విదే శీ నిపుణుడు బెర్గెర్, కేం ద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, 2 లను జి హిల్ నుంచి వీక్షించారు. నిర్మా ణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతి ని ధులు వారికి ఈసి ఆర్ ఎఫ్ ని ర్మా ణం జరుగుతున్న తీరును వివ రిం చారు. విదేశీ నిపు ణుడు బెర్గెర్, కేం ద్ర అధికారుల బృందం పర్యటన గురు, శుక్రవారాల్లో కూడా కొనసాగనుంది.

     ప్రాజెక్ట్ లో రెండోరోజు సిఎస్ఎంఆర్ఎస్ పరీక్షలు

    పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సం స్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం బుధ వారం రెండో రోజు పరీక్షలు నిర్వ హించింది. ఈ పరీక్షలు గురువారం కూడా కొ నసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లో ని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడ వూ, హరి టినాయర్, గౌరవ్ పాండే ఉన్నా రు. వీరు బుధవా రం గ్యాప్ 2 ప్రాంతంలో 14 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీ క్షల్లో గ్యాప్ 2 లో వాడి న మట్టిలో తేమ శాతం యెంత ఉం ది, దాని పటుత్వం ఎలా ఉందో చూసారు. ఇదే తరహాలో రాతిని కూడా పరీక్షించారు.

    ప్రాజెక్ట్ నిర్మా ణంలో భవిష్యత్ అవసరాల కోసం వినియోగిం చే మట్టి నాణ్యత ఎ లా ఉందొ కూడా పరీక్షలు నిర్వ హించా రు. ప్రాజెక్ట్ ఎర్త్ కం రాక్ ఫి ల్ డ్యామ్ పనులు వేగంగా జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పోర తరువాత మరో పొ ర నిర్మించే సమయంలో ఎక్కువగా పరీక్ష లు నిర్వహించి పా టుత్వాన్ని పరీక్షి స్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డిఈలు డి శ్రీ ని వాస్, శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జిఎం ఏ గంగాధర్, డిజిఎంలు మురళి పమ్మి, గుట్ట పాటి శంకరయ్య ఉన్నారు.

    ఇదిలా ఉండగా సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో పోలవ రం ప్రాజెక్ట్ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ కలయికతో ఒక అభేద్యమైన కోటలా రూపుదిద్దుకుంటోందని ఈ పరీక్షలు నిరూపిస్తున్నాయి.ప్రస్తుతం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (EC RF) పనులు శరవే గంగా సాగుతున్నాయి. ఒక లేయర్ (పొర) వేసిన తర్వాత, దానిపై మరో లేయర్ నిర్మించేటప్పు డు ప్రతి అడుగులోనూ మట్టి పటుత్వాన్ని పరీక్షిస్తాం. ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తే, ప్రాజెక్ట్ అంత పటిష్టంగా మారుతుం ది” అని శాస్త్రవేత్తల బృం దం స్పష్టం చేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.