Sunday, September 27, 2026
More
    HomeOpinionDistrict Collector Badugu Chandrasekhar : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మ డి జిల్లా సన్నాహక...

    District Collector Badugu Chandrasekhar : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మ డి జిల్లా సన్నాహక సమావేశం వాయిదా

    📰 Generate e-Paper Clip

     

    District Collector Badugu Chandrasekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని అధికారులు, సిబ్బం ది అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళి కను విజయ వంతం చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్. పరిపాలన పర మైన కారణాల వల్ల ఈనెల 6న ని ర్వహించదలచిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మడి న ల్గొండ జి ల్లా సన్నాహక సమావేశాన్ని 7న ఉదయం 10 గం టలకు ఉదయా దిత్య భవన్ లో నిర్వహించనున్న ట్లు జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శే ఖర్ తెలిపారు.ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పై గురువారం అయన జి ల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆ ర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీ వోలు, మండల స్థాయి అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.

    రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించే ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళిక కార్యక్ర మంలో భాగంగా ప్రధాన అంశాల వారిగా కా ర్యక్రమాలు నిర్వహించా లని చెప్పారు. మొదటి ప్రధాన అం శమైన “పరిసరాల పరిశుభ్రత, ఫై ళ్ళ పరిష్కరణ” కార్యక్ర మాన్ని ఈ నెల 6 నుండి మార్చి 15 వరకు జిల్లా స్థాయి మొ దలుకొని గ్రామస్థాయి వరకు నిర్వహించాలని, ఇందులో భా గంగా అన్ని కార్యాలయాలలో ప్రభుత్వ సంస్థలలో పరిశుభ్ర త కార్యక్రమాలు చేపట్టాలని, ఆ యా విభాగాల వారిగా పెం డింగ్ లో ఉన్న ఫైళ్ల జాబితా రూపొందించి మార్చి 15 నాటి కి అన్ని పైల్స్ పరిష్కరించాలని ఆదేశించారు.

    రెండవ అంశమైన “ఆరోగ్యం” లో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వర కు నిర్వహించే ఆరోగ్య కార్యక్రమా లలో భాగంగా మహిళా శిశు ఆరో గ్యం ,టీకాల ప్రాముఖ్యత, గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు, ఆరోగ్య శిశు వుల పోటీలు,వెక్టర్ ద్వారా వ్యా పిం చే వ్యాధుల నియంత్రణ, నవజాత శిశు సంరక్షణ, బరు వు తక్కువగా ఉన్న పిల్లల గుర్తింపు వంటి కార్య క్రమాలపై చర్చించాలని, అలాగే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పా రు.

    సురక్షితంగా చేరండి ” పేరున ఏప్రి ల్ 13 నుండి 18 వరకు నిర్వహిం చనున్న రహదారి భద్రత కార్య క్ర మంలో భాగంగా ప్రమాదాలు ఎ క్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న రహ దారులను గుర్తించాలని, ప్రమాదాల నివారణకు తీసుకోవా ల్సిన అంశాలపై ప్రజలకు తెలి య జేయడం, రహదారి భద్ర తపై అవగాహన, రోడ్డు భద్రత నియమాల పై ప్రతిజ్ఞ వంటివి చేయించాలన్నా రు.

    మరో ప్రధాన అంశమైన సంక్షేమo లో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న చే యూత పింఛన్లు, ఇందిర మ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహా లక్ష్మి, ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ, మ హాలక్ష్మి ఉచిత బస్సుసౌ కర్యం, గృ హ జ్యోతి కింద లబ్ధిదారులకు అం దించిన లబ్ధిని గ్రామాల వారిగా స మాచారాన్ని రూపొందించి. గ్రామ వార్డు సభలలో వినిపించాలని, అందరూ లబ్ధిదారులను గ్రామసభ కు ఆహ్వానించి తెలియజేయాలని చెప్పారు. చిన్నపిల్లల సం రక్షణ, నో డ్రగ్స్” కింద ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వ హించే కార్యక్రమంలో భాగంగా యువత, డ్రగ్స్ బారిన ప డకుండా అలాగే మహిళలు, పిల్ల లపై దాడుల నివారణ, బాల్యవివా హాల నివారణ, తదితరాంశాలపై అవగాహన కల్పించాలని తెలిపా రు

    వ్యవసాయం”లో భాగంగా మే 4 నుండి 10 వరకు సోలార్ పంపు సెట్ల నిర్వహణ, రైతు భరోసా, రై తు బీమా, పంటల మార్పిడి, త ది తర అంశాలు, అలాగే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, సన్న బియ్యం బోనస్, నీటిపారుదల, ఆయిల్ పా మ్ తోటల పెంపకం వంటి వాటి పై అవగాహన కల్పించా లని చెప్పా రు. మే 11 నుండి 16 వరకు “వి ద్య, పాఠశాల ల్లో మౌలిక వసతుల” కల్పన సందర్భంగా అన్ని పాఠశా ల ల్లో పరిశుభ్రత, ఈ-వస్ట్ మేనేజ్మెం ట్ నిర్వహణ, బడి మాని వేసి పిల్లలను బడిలో నమోదు చేయించ డం, అక్షరాస్యత కార్యక్రమాలు, అదేవిధంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

    యువత, క్రీడల” అంశంలో భాగం గా మే 18 నుండి 23 వర కు తెలం గాణ క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసు కురావడం, అన్ని పా ర్కులు, క్రీడా మైదానాలను శుభ్రం చే యటం, గ్రామస్థాయి మొదలుకొ ని జిల్లా స్థాయి వరకు 10 కే ,5 కె,2 కె మారతాన్ల నిర్వహణ చేపట్టాల ని ఆదేశించారు. మహిళా సంక్షే మం”లో భాగంగా మే 25 నుండి 30 వరకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు అందిస్తు న్న పథకాలు, కార్యక్రమాలు, స్వ యం సహాయక సంఘాలకు రు ణాల మంజూరు ,మహిళల సమ స్యలు, వారి సంక్షేమం, తీసుకోవా ల్సిన అంశాలపై చర్చించాలని తెలి పారు.

    జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణ కార్యక్రమాల కింద సిం గిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించ కుండా అవగా హన కల్పించడంతో పాటు, వనమహోత్సవం కింద పెద్ద ఎ త్తున మొక్కలు నాటే విషయంపై దృష్టి సారించాలని, అలా గే చెరు వులు, కాలువలు కబ్జాకు గురైన ట్ల యితే వాటిని తొలగించడం చే యాలని తెలిపారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ/ వార్డు /మున్సిపల్ వా ర్డు/ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ల స్థాయిలో సమా వేశం నిర్వహిం చడం జరుగుతుందని, అలాగే ఏ ప్రిల్ 16 న మండల స్థాయిలో, మే 2 న నియోజకవర్గస్థాయిలో, మే 22 న జిల్లా స్థాయిలో ,జూన్ 2న రాష్ట్రస్థాయిలో కార్యక్రమా ల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

    గ్రామ సభకు గ్రామస్థాయిలోని అధి కారులు, ప్రజాప్రతిని అందరిని ఆ హ్వానించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అ ధికారులు మొదలుకొని, గ్రామస్థాయి వరకు అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాల ని ,ప్రతి కార్యక్రమానికి ని వేదిక రూ పొందించడమే కాకుండా, ఫోటో లు, వీడియోల రూపంలో డాక్యు మెంట్ రూపంలో భద్రపరచాలన్నారు. ఈ నెల 12న జిల్లా స్థాయి లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్ర మం నిర్వహించడం జరుగు తుందని ఈ కార్యక్రమానికి ప్రజాప్రతిని ధులను అధికారు లందరూ ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు.

    ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా అధికారులు క్షేత్ర స్థాయి లో సందర్శించినప్పుడు పాఠశా ల లు, హాస్టల్లను సందర్శించాలని ఎ క్కడా ఫుడ్ పాయిజన్ కేసులు రా కుం డా చూడాలని, క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం నివేదిక ను స మర్పించాలని, ఇసుక అక్రమ రవా ణామైనింగ్ వంటి వి అరికట్టాలని, గ్రామపంచాయతీ వారిగా 99 రో జుల కా ర్యకరణ ప్రణాళిక రూపొందించాలని, ఉగాదికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు లబ్ధి దారులను సిద్ధం చేయాల ని, అదే విధంగా జూన్ 2 నాటికి కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.

    రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థ ల ఇన్చార్జి అద న పు కలెక్టర్ వై.అ శోక్ రెడ్డి ,దేవరకొండ ఆర్ డిఓ ర మణారెడ్డి, తహసిల్దారులు, ఎంపీ డీవోలు మాట్లాడారు. అంతకు ముం దు జిల్లాకలెక్టర్ జనగణనపై తహసిల్దారులకు పలు సూచన లు చేశారు. సిపిఓ శ్రీనివాస్ ,జిల్లా పరిషత్ సీ ఈవో శ్రీనివా సరావు ఇతర అధికారులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.