Monday, September 28, 2026
More
    HomeIndiaMassive transfer of Governors : బిగ్ బ్రేకింగ్, దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీమార్పులు, పలురాష్ట్రాలకు కొత్త...

    Massive transfer of Governors : బిగ్ బ్రేకింగ్, దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీమార్పులు, పలురాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు

    📰 Generate e-Paper Clip

     

    Massive transfer of Governors:  ప్రజా దీవెన, హైద రాబాద్: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసు కుంది. భారత రాష్ట్రపతి పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను నియ మిస్తూ కీలక ఉత్తర్వు లు జారీ చేశారు. ఒకేసారి పలువురు గవర్నర్ల బదిలీలు, కొ త్త నియామకాలతో దేశవ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థలో పె ద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.

    ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను ఇప్పుడు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా నియమించారు. అదే సమయంలో మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సందును ఢి ల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.ఇక హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉ న్న శివ ప్ర తాప్ శుక్లాను తె లంగాణ గవర్నర్‌ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ శ ర్మను మహారా ష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. సీనియర్ నా యకుడు నంద కిషోర్ యాదవ్ ను నాగాలాండ్ గవర్నర్‌ గా నియమించారు.లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్య ద్ అతా హుస్సేన్ ను బీహార్ గవ ర్నర్‌గా నియమిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో తమి ళ నాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిను వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చే శారు.కేరళ గవర్న ర్ రాజేంద్ర ఆర్లేకర్ తమిళనాడు గవర్నర్‌ గా నియమించారు.

    లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ను హిమాచల్ ప్ర దేశ్ గవర్నర్‌గా నియమించారు. ఇదిలా ఉండగా దేశవ్యా ప్తంగా గవర్నర్ ప దవుల్లో జరిగిన ఈ పెద్ద మార్పులు రాజ కీయంగా మరియు పరిపాల నా పరంగా అత్యంత కీలక పరి ణామంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్పులు రాష్ట్రాల రా జకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవ కాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.