Wednesday, September 30, 2026
More
    HomeOpinionDistrict Collector Badugu Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, సమన్వ యంతో 99 రోజుల...

    District Collector Badugu Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, సమన్వ యంతో 99 రోజుల కార్యచరణ ప్ర ణాళిక విజయవంతం చేయాలి 

    📰 Generate e-Paper Clip

    District Collector Badugu Chandrasekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా ప్రతి నిధులు, అధికారులందరి సమ న్వయం, సహకారంతో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రో జుల కార్య చరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జి ల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అప్పీల్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరో గ్య కేంద్రం లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వై ద్య శిబిరాన్ని సందర్శించారు.

    పేదవారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రా ష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పా లన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మార్చి 6 నుండి 31 వరకు జిల్లా లోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రా థ మిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఒక రోజు ఆరురకాల ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

    ఇందుకు గాను నిపుణులైన డాక్ట ర్స్ ను పిలిపించడం జరి గిందని, ముఖ్యంగా డెంటల్, ఓబీజీ, ఆర్తో, ఆప్తమాలజీ, పీడి యాట్రిషన్ డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించడ మే కా కుండా, మందులు, తదుపరి వైద్య సేవలను అందిస్తున్నట్లు చె ప్పారు. రోగులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రత్యేకంగా ఒ క ఐడి నెంబర్ ఇవ్వడం జరుగు తుందని, దా ని ఆధారంగా వైద్య సేవలు అందించడంతోపాటు, భవి ష్య త్తులో కూడా వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. స్పె షలిస్ట్ డాక్టర్లు ప్రతిరోజు రెండు, మూడు పీహెచ్సీలను క వర్ చేస్తూ ఇలా అన్నిపీహెచ్ సిలను కవర్ చే యడం జరు గుతుందని చెప్పారు.

    ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భా గంగా శుక్రవారం నుండి అన్ని ప్ర భుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పరిశుభ్రత కార్యక్ర మా లను చేపట్టడం జరుగుతున్న దని, అంతేకాక ఫైళ్ల పరిష్కా రం కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధు లు, అధికారులు అందరి సమన్వ యంతో ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యాచరణ ప్రణా ళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఏర్పాటు చేసిన ఆప్తమాల జీ, ఆర్తో, డెం టల్, ఇతర కౌంటర్ల తో పాటు, రిజిస్ట్రేషన్ కౌంటర్ ను పరిశీ లించి రోగులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను విని తె లుసుకొని వారి సమస్యల పరిష్కా రానికి డాక్టర్లను ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహె చ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రి సూపరిం టిం డెంట్ నేత నరసిం హారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యా ణ్ చక్రవర్తి ,లైన్ వాడ యూ పీ హెచ్ సి డాక్టర్ ఇఫ్టేయార్, లైన్ వాడ కార్పొరేటర్ మహమ్మద్ ఖా జా సమయుద్దిన్ నదీమ్, డాక్టర్లు తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.